»Ka Paul Bumper Offer To Ponguleti Srinivas Khammam Rs 10 Thousand Crore Development
Ponguleti srinivas:కు కేఏ పాల్ బంపర్ ఆఫర్..ఖమ్మం రూ.10 వేల కోట్లతో అభివృద్ధి
పొంగులేటి ప్రజా శాంతి పార్టీలో చేరితే ఉప ముఖ్యమంత్రిని చేస్తా కేఏ పాల్(KA Paul) క్రేజీ ఆఫర్ ప్రకటించారు. అంతేకాదు ఖమ్మం జిల్లాను 10 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేద్దామని వెల్లడించారు.
సస్పెన్షన్‌కు గురైన బీఆర్ఎస్ నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti srinivas), జూపల్లి కృష్ణారావులను కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు తమ పార్టీల్లోకి రావాలని ప్రలోభపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇటీవల మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డితో బీజేపీ టచ్‌లో ఉన్నానని బీజేపీ జాయినింగ్ కమిటీ హెడ్‌గా ఉన్న ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరడానికి వారు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. దీంతో వారు కాంగ్రెస్ పార్టీలో చేేరేందుకు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరో 10 నుంచి 15 రోజుల్లో తాను ఏ పార్టీలో చేరతానో స్పష్టం చేస్తానని పొంగులేటి వెల్లడించారు.
ఈ క్రమంలో తాజాగా పొంగులేటీతోపాటు పలువురు నేతలు తమ పార్టీలోకి రావాలని పొంగులేటి ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) కోరారు. అంతేకాదు పొంగులేటికి అవసరమైతే ఉపముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తానని ఆఫర్ చేశారు. తాను కేవలం ఆరు నెలలు మాత్రమే సీఎంగా ఉంటానని పాల్ అన్నారు. తర్వాత ఎవరికీ సీఎం సీట్ ఇస్తామనేది కూడా నిర్ణయిస్తామని తెలిపారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటెల రాజేందర్ కలిసి కొత్తగా పార్టీ పెట్టినా కూడా ఒక్క సీట్ అయినా గెలుస్తారా అంటూ ప్రశ్నించారు. మీ అన్నను నేను ఉన్నాను కదా. నా పార్టీలో చేరాలని కేఏ పాల్ కోరారు. ఇన్ని పార్టీలు మారారు కదా నా పార్టీలో చేరాలని సూచించారు.
పొంగులేటికి ఖమ్మంలో 10 సీట్లు అడిగితే 10 ఇస్తానని వెల్లడించారు. దీంతోపాటు ఖమ్మం(khammam) జిల్లాను 10 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేద్దామని వెల్లడించారు. పింఛన్ల డబుల్ చేద్దామని, ఇప్పుడున్న పనులకు దీటుగా డెవలప్ చేద్దామని కేఏ పాల్ పొంగులేటికి బంపర్ ఆఫర్ ప్రకటించారు. అయితే అనేక రోజులుగా పొంగులేటి శ్రీనివాస్ ఏ పార్టీలో చేరకుండా ఉన్న నేపథ్యంలో కేఏ పాల్ కూడా స్పందించారు.