»Son Commits Suicide Because He Lost The Phone Bought By His Father Borabanda Hyderabad
Father: కొనిచ్చిన ఫోన్ పోయిందని..కుమారుడు ఆత్మహత్య
మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. అనేక కుటుంబాల్లో ఉద్యోగం చేస్తే గానీ ఇల్లు గడిచే పరిస్థితి ఉండదు. ఒకవేళ అనుకోకుండా ఏదైనా కొనాలన్నా, తీసుకోవాలన్నా ఆకస్మాత్తుగా అప్పులు చేయాల్సిందే. అటువంటి పరిస్థితుల్లో తాజాగా ఓ ఫోన్ పొగొట్టుకున్న యువకుడు తండ్రిని మళ్లీ ఇబ్బందిపెట్టలేక బలవన్మరణం చేసుకున్నాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ బోరబండ(borabanda)లో చోటుచేసుకుంది.
తండ్రి కొనుగోలు చేసిన ఫోన్ పోయిందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ బోరబండ(borabanda )లో జరిగిన ఈ దుర్ఘటన వివరాలు ఇప్పుడు చుద్దాం. డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న ఓ యువకుడి ఫోన్ మొదట ఓ చోట దొంగిలించబడింది. ఆ తర్వాత తండ్రి EMI ద్వారా మరో రూ.28 వేల ఫోన్ కొనిచ్చాడు. అది కూడా పోవడంతో మళ్లీ తండ్రిని ఫోన్ కోసం ఇబ్బంది పెట్టలేక తానే బలవన్మరణం చేసుకున్నాడు. అంతేకాదు అతను రైలు కింద పడడానికి ముందు తన తల్లిని బాగా చూసుకోమని తన సోదరుడికి చెప్పి మరీ ఈ ఘతుకానికి పాల్పడ్డాడు.
చుక్కా శ్రీనివాస్ నిమ్స్ ఆసుపత్రిలో వార్డుబాయ్ గా విధులు నిర్వహిస్తూ బోరబండ రాజానగర్ లో నివాసం ఉంటున్నాడు. శ్రీనివాస్ రెండో కుమారుడు చుక్కా సాయికుమార్ బిగ్ బాస్కెట్లో డెలివరీ బాయ్(delivery boy)గా పనిచేస్తున్నాడు. నెల రోజుల క్రితం కృష్ణకాంత్ పార్క్‌ను సందర్శించినప్పుడు సాయి కుమార్ తన ఫోన్ మిస్ చేసుకున్నాడు. ఆ క్రమంలో తన ఉద్యోగానికి ఫోన్ అవసరమని శ్రీనివాస్ తన తండ్రికి తెలియజేయడంతో, అతను రెండవ ఫోన్‌ను EMIలో రూ. 28 వేలు పెట్టి కొనిచ్చాడు. అయితే సాయికుమార్ ఇటీవల ఈ ఫోన్‌ను కూడా మిస్ చేసుకున్నాడు.
ఆ క్రమంలో ఫిర్యాదు చేయడానికి బోరబండ పోలీస్ స్టేషన్(police station)కు వెళ్లాడు. అయితే అధికారులు ఈ సేవాలో ఫిర్యాదు చేయాలని కోరారు. అనంతరం ఫిర్యాదు చేసేందుకు స్నేహితులతో కలిసి ఈ-సేవాకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత సాయికుమార్ ఆచూకీ ఎవరికీ తెలియలేదు. ఈ నేపథ్యంలోనే సాయికుమార్ తండ్రి శ్రీనివాస్‌కు రైల్వే పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. తుకారాంగేట్ వద్ద ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని ఎవరైనా వచ్చి గుర్తించాలని కోరారు. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న శ్రీనివాస్..కుమారుడు సాయి కుమార్ శరీరాన్ని చూసి బోరున విలపించాడు. ఆ క్రమంలో శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.