»Justice Abdul Nazeer Sworn As Andhra Pradesh Governor In Vijayawada
Governor Sworn: ఏపీ గవర్నర్ గా ప్రమాణం చేసిన జస్టిస్ అబ్దుల్ నజీర్
ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చాలా రోజుల తర్వాత రాజ్ భవన్ కు చంద్రబాబు వచ్చారు. ఇటీవల గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన తేనీటి విందుకు గైర్హాజరైన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ (Andhra Pradesh Governor)గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ (Justice Abdul Nazeer) బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని రాజ్ భవన్ లో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా (Justice Prashanth Kumar Mishra) ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ (YS Jagan Mohan Reddy), తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party), ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu)తో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం గవర్నర్ హాజరైన అతిథులకు తేనీటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మంత్రులు, తమ పార్టీ ఎమ్మెల్యేలను గవర్నర్ కు పరిచయం చేశారు. కాగా ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చాలా రోజుల తర్వాత రాజ్ భవన్ కు చంద్రబాబు వచ్చారు. ఇటీవల గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన తేనీటి విందుకు గైర్హాజరైన విషయం తెలిసిందే.
గవర్నర్ నేపథ్యం
1958 జనవరి 5వ తేదీన కర్ణాటకలోని మూడబిదరి తాలుక బెలువాయి గ్రామంలో జన్మించారు. బాల్యమంతా స్వగ్రామంలో జరిగింది.
మహావీర కళాశాలలో బీకాం చదివారు.
మంగళూరు కొడియాల్ బెయిల్ ఎస్డీఎం న్యాయ కళాశాలలో డిగ్రీ పూర్తి
1983 ఫిబ్రవరి 18న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు.
కర్ణాటక హైకోర్టులో కెరీర్ ప్రారంభం
2003 మే 12న కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు
2004 సెప్టెంబర్ 24న శాశ్వత న్యాయమూర్తి గా పదోన్నతి
2017 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై 2023 జనవరి 4వ తేదీ వరకు కొనసాగారు.
కీలక తీర్పులు
న్యాయమూర్తిగా పలు కీలక తీర్పులు ఇచ్చారు. అయోధ్య తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిల ధర్మాసనంలో జస్టిస్ అబ్దుల్ నజీర్ కూడా ఉన్నారు.
2017లో వివాదాస్పద త్రిబుల్ తలాక్ కేసును విచారించిన ధర్మాసనంలో ఉన్న ఏకైక మైనారిటీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్