»Congress Plenary 2023 Elections Target All Set To Plenary In Raipur
Congress Plenary: ఎన్నికలే లక్ష్యం.. ఇదే అజెండాతో నేటి నుంచి కాంగ్రెస్ ప్లీనరీ
ఈ ప్లీనరీలో జరిగిన సందేశాన్ని పార్టీ శ్రేణులకు వివరించి వారిలో నూతనోత్తేజం తీసుకురావాలని భావిస్తున్నది. కేంద్రం చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ ఆదేశించనుంది. పార్టీని పటిష్టం చేయడంతో పాటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ (Indian National Congress Party-INC) వ్యూహం రచిస్తోంది.
సాధారణ ఎన్నికలకు ఇంకా సంవత్సరం ఉంది. పార్టీని పటిష్టం చేయడంతో పాటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ (Indian National Congress Party-INC) వ్యూహం రచిస్తోంది. ఈ మేరకు పార్టీ వ్యూహకర్తలతో పాటు పార్టీ అధిష్టానం వ్యూహ రచనను పార్టీ నాయకులకు తెలుపనుంది. ఇదే అజెండాతో కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు (Plenary Session) జరుగనున్నాయి. చత్తీస్ గఢ్ రాష్ట్రం రాజధాని రాయ్ పుర్ (Raipur) వేదికగా మూడు రోజుల పాటు ప్లీనరీ జరుగనుంది. ఈ ప్లీనరీలో జరిగిన సందేశాన్ని పార్టీ శ్రేణులకు వివరించి వారిలో నూతనోత్తేజం తీసుకురావాలని భావిస్తున్నది. కేంద్రం చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ ఆదేశించనుంది.
నేటి నుంచి ప్రారంభమయ్యే మూడు రోజుల ప్లీనరీకి రాయ్ పూర్ లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi)తో పాటు జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge), రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi), పార్టీ అగ్ర నాయకులతో పాటు 15 వేల మంది పార్టీ ప్రతినిధులు హాజరు కానున్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం తొలిసారి ఖర్గే సారథ్యంలో ఈ ప్లీనరీ జరుగుతోంది. ఈ ప్లీనరీలో కొత్త వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) (Congress Working Committee-CWC)పై నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్నికలు నిర్వహించాలా? లేదా అనేది శుక్రవారం తేల్చనున్నారు.
ఎన్నికల్లో విజయమే లక్ష్యం
ప్లీనరీలో ఎన్నికలే లక్ష్యంగా పార్టీ చర్చలు జరుగనున్నాయి. రెండు నెలల్లో కర్ణాటక, తర్వాత ఈ ఏడాదిలోనే జరుగనున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ ఎన్నికల్లో విజయం సాధించాలని పార్టీ భావిస్తోంది. ఈ ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకురావడంపైన వ్యూహం ప్లీనరీ వేదికగా సిద్ధం చేయనున్నారు. ఆ ఎన్నికల విజయోత్సాహంతో 2024 సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. వీటితోపాటు బీజేపీ (BJP)ని ఒంటరిగా ఎదుర్కోవడం కష్ట సాధ్యం కావడంతో తమతో వచ్చే పార్టీలతో పొత్తుల విషయమై కూడా ప్లీనరీలో చర్చించనున్నారు. భావసారూప్య పార్టీలతో కలిసి పోటీ చేయాల్నా? లేక బయటి నుంచి మద్దతు కోరాలా అనే దానిపై సమాలోచనలు చేయనున్నారు. ఇప్పటికే వచ్చే ప్రభుత్వం తమదేనని ఖర్గే బలంగా చెబుతున్నారు. ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా కలిసి వెళ్తే బీజేపీని దెబ్బ కొట్టవచ్చని చాలా మంది చెబుతున్నారు. దీనిపై చర్చించనున్నారు.
ప్లీనరీ వేళ కాంగ్రెస్ (Congress Party)కు వరుస షాక్ లు తగులుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రంలో కాంగ్రెస్ లక్ష్యంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులు చేసింది. ముఖ్యంగా పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు నివాసాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇక తమిళనాడులో కీలక నాయకుడు సీఆర్ కేశవన్ (CR Kesavan) రాజీనామా చేశాడు. ప్రధాని మోదీపై విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలపై పార్టీ సీనియర్ నాయకుడు పవన్ ఖేడా (Pavan Kheda)ను అరెస్ట్ చేశారు. ప్లీనరీ కోసం రాయ్ పూర్ వస్తుండగా అతడిని పోలీసులు అరెస్ట్ చేయడం తీవ్ర దుమారం రేపింది. విమానాశ్రయంలోనే కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ప్లీనరీపై ప్రజల దృష్టి పడకుండా కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఆ కుట్రలో భాగమే ఈడీ దాడులు, పవన్ ఖేడా అరెస్ట్ అని పేర్కొన్నారు.