»Junior Colleges In Telangana To Reopen On June 1st 2023
Telangana:లో జూనియర్ కాలేజీలు రీ ఓపెన్ ఎప్పుడంటే..!
రాష్ట్రంలో వేసవి సెలవులు మే 31తో ముగుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూనియర్ కళాశాలల తరగతులు ఈ విద్యా సంవత్సరానికి(2023-24) సంబంధించి జూన్ 1న తిరిగి ప్రారంభం కానున్నాయి. మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థులకు క్లాస్‌వర్క్ కూడా రేపటి నుంచి ప్రారంభమవుతుందని ఈ మేరకు కాలేజీల యాజమాన్యాలు ప్రకటించాయి.
వేసవి సెలవలు అయిపోయాయి. మళ్లీ కాలేజీలు ఓపెన్ అయ్యే సమయం రానే వచ్చింది. వేసవి సెలవులు మే 31తో ముగుస్తుండటంతో, జూనియర్ కళాశాలలు తాజా విద్యా సంవత్సరానికి అంటే 2023-24 జూన్ 1న మళ్లీ ప్రారంభమవ్వనున్నాయి. మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థులకు గురువారం నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అడ్మిషన్ షెడ్యూల్ ప్రకారం, మొదటి దశ అడ్మిషన్లు పూర్తి చేయడానికి జూన్ 30 చివరి తేదీ. గడువులోగా రెండవ దశకు షెడ్యూల్ ప్రకటించనున్నారు. కొత్త అకడమిక్ క్యాలెండర్ ప్రకారం, విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి 304 రోజులలో అన్ని జూనియర్ కాలేజీలకు 227 పని దినాలు ఉంటాయి.
ఇదిలా ఉండగా, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ 407 ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో (GJC) మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి పనులను ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వానికి 301.24 కోట్ల రూపాయల ప్రతిపాదనను పంపింది. 212 GJCలలో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లతో పాటు జిజెసిల కోసం ఎనిమిది కొత్త భవనాలు నిర్మించనున్నారు. ప్రభుత్వ సెలవులు, ఆదివారాల్లో ఎట్టి పరిస్థితుల్లో తరగతులు నిర్వహించరాదని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాలేజీల్లో అడ్మిషన్లను ఇంటర్‌బోర్డు ప్రకటించే షెడ్యూల్ ప్రకారమే తీసుకోవాలని హెచ్చరించారు.