»It Stocks Effect Sensex Lost 520 Points Stock Market On April 17th 2023
Stock Market: 520 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్..ఐటీ స్టాక్స్ ఎఫెక్ట్!
దేశంలో ప్రధానంగా ఐటీ, బ్యాంకింగ్ రంగాల ఆదాయాల నివేదికలు రానున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు(indian stock market) సోమవారం నష్టాలను చవిచుశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్(Sensex) 520 పాయింట్లు కోల్పోవగా, నిఫ్టీ(nifty) 121 పాయింట్లు నష్టపోయింది.
indian stock market losses december 21st 2023 sensex loss 440 points
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం(monday) భారీ నష్టాల(heavy losses)తో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న ప్రతికూల ధోరణుల దృష్యా దేశీయ మార్కెట్లు కూడా దిగువకు పయనించారు. ఈ క్రమంలో బీఎస్ఈ(BSE) సెన్సెక్స్ 520 పాయింట్లు కోల్పోగా, ఎన్ఎస్ఈ(NSE) నిప్టీ 121 పాయింట్లను నష్టపోయింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ(BANK NIFTY) సూచీ మాత్రం 130 పాయింట్లను లాభపడింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ 59,911 వద్ద ఉండగా, నిఫ్టీ 17,707 వద్ద స్థిరపడగా, బ్యాంక్ నిఫ్టీ 42,263 పాయింట్లకు చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశంలో ఐటీ సంస్థల స్టాక్స్ ఇన్ఫోసిస్ 15% పతనం కాగా IT స్టాక్స్ పెద్ద ఎత్తున అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. దీంతో 13 ప్రధాన రంగాల్లోని సూచీల్లో ఎనిమిది క్షీణించాయి. ఈ క్రమంలో IT ఇండెక్స్ ఏకంగా 6.5% పడిపోయింది. మార్చి 2020 తర్వాత ఇది అతిపెద్ద నష్టమని చెప్పవచ్చు. మరోవైపు ఈ వారం రిపోర్టు ఫలితాల కారణంగా హెచ్‌సీఎల్‌టెక్ 4.8 శాతం పడిపోయింది. టెక్ మహీంద్రా 6.6% క్షీణించింది.
ఇక ఇతర స్టాక్‌లలో టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచుతుందని చెప్పడంతో ఓపెన్‌లో పెరిగింది. అయితే దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రుణదాత త్రైమాసిక లాభాలను పెంచిన తర్వాత HDFC బ్యాంక్ కొత్త 52 వారాల గరిష్ట స్థాయిని చేరింది. ఈ రెండు స్టాక్‌లు లాభాలను వదులుకుని వరుసగా 0.4% మరియు 1.9% తగ్గాయి.
నిఫ్టీలో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎన్టీపీసీ, లార్సెన్ అండ్ టూబ్రో ప్రధాన నష్టాల్లో ఉండగా, నెస్లే ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎస్బీఐ, బ్రిటానియా ఇండస్ట్రీస్ లాభపడ్డాయి.
సెక్టోరల్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 4.7 శాతం, ఫార్మా ఇండెక్స్ 0.6 శాతం క్షీణించగా, పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 3 శాతం, ఆయిల్ & గ్యాస్, రియల్టీ, ఎఫ్ఎంసిజి సూచీలు ఒక్కొక్కటి 1 శాతం చొప్పున పెరిగాయి. మరోవైపు బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.15 శాతం పెరిగింది. మరోవైపు నిఫ్టీకి 17,200-17,600 శ్రేణిలో మద్దతు, 18,200 వద్ద నిరోధం లభిస్తుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.