»Update From Vikram Thangalaan Movie April 17th 2023 New Glimpse
Vikram: తంగళన్ మూవీ నుంచి అప్ డేట్…సరికొత్త లుక్ లో చియాన్
స్టార్ హీరో విక్రమ్(Vikram) పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 17న తన తాజా చిత్రం తంగళన్(Thangalaan) నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు పా రంజిత్(Pa Ranjith) దర్శకత్వం వహిస్తుండగా..జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రం తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.
ప్రముఖ నటుడు విక్రమ్(Vikram) పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 17న తంగళన్(Thangalaan) చిత్రం నుంచి గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఆదివారం ప్రకటించారు. ఈ మేరకు విక్రమ్ పోస్టర్‌ను షేర్ చేస్తూ స్టూడియో గ్రీన్ ట్విట్ చేసింది. తంగళన్ మూవీ ప్రపంచం నుంచి శక్తివంతమైన వాటి విడుదల కోసం సిద్ధంగా ఉండండి అంటూ రాసుకొచ్చింది. పా రంజిత్(Pa Ranjith) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే 80% షూటింగ్ పూర్తయిందని తెలుస్తోంది. ఈ చిత్రం షూటింగ్ కోసం తారాగణం, సిబ్బంది 55 రోజుల పాటు అవిశ్రాంతంగా పనిచేసినట్లు తెలిసింది. ఇంకో 20 రోజుల్లో షూటింగ్ మొత్తం పూర్తి కానున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాను పూర్తి చేసి త్వరలోనే విడుదలకు సిద్ధం చేస్తామని రంజిత్ ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు ఈ చిత్రంలో విఎఫ్ఎక్స్(VFX) ఎక్కువగా ఉందని, పోస్ట్‌ప్రొడక్షన్‌ని అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకు చిత్ర బృందం తీవ్రంగా శ్రమిస్తోందని పా రంజిత్(Pa Ranjith) అన్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది చివర్లో సినిమా విడుదలకు సిద్ధమవుతుందని వెల్లడించారు. గతంలో వచ్చిన రూమర్లకు భిన్నంగా తంగలన్ రెండు భాగాల సినిమా కాదని రంజిత్ ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్‌తో తన సినిమా గురించి కూడా అప్డేట్ ఇచ్చాడు. తాను ఇంకా స్క్రిప్ట్ రాస్తూనే ఉన్నానని చెప్పుకొచ్చారు. తంగలన్ పూర్తి చేసిన తర్వాత మాత్రమే తన తదుపరి ప్రాజెక్టులు ఉంటాయని స్పష్టం చేశారు.
తంగలన్(Thangalaan) కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్ గనుల మూలాల కథ ఆధారంగా సినిమాను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇందులో పార్వతి తిరువోతు, పశుపతి, మాళవిక మోహనన్, హరి కృష్ణన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి స్టూడియో గ్రీన్, నీలం ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నాయి. జీవీ ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. తమిళ ప్రభ ఈ చిత్రానికి సహ రచయితగా వ్యవహరిస్తుండగా, సెల్వ ఆర్కే, ఎస్ఎస్ మూర్తి ఎడిటింగ్, ఆర్ట్ విభాగాలను నిర్వహించనున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
Get ready for something powerful from the world of #Thangalaan!