»Iphone 15 Pro Has A New Design Frame And New Button Release At The End Of The Year
iPhone 15 Pro: సరికొత్త డిజైన్ ఫ్రేమ్, కొత్త బటన్లు..ఏడాది చివర్లో రిలీజ్
ఆపిల్ తన 2023 సిరీస్ ఐఫోన్ 15 స్మార్ట్ఫోన్లలో భాగంగా ఈ ఏడాది చివర్లో ఐఫోన్ 15 ప్రోని విడుదల చేయనుంది. అయితే ఈ మోడల్ ఫోన్ గురించి ఒక కొత్త లీక్ వచ్చింది. ఐఫోన్ 15 ప్రో డిజైన్ లో మార్పులు ఉన్నట్లు తెలిసింది. దాని మొత్తం ఫ్రేమ్, కెమెరా మాడ్యూల్, అంచులు, ప్రదర్శనలో మార్పులను తీసుకోస్తున్నట్లు సమాచారం.
ఐఫోన్ కొత్త మోడల్ కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే ఈ ఏడాది చివరిలో ఐఫోన్ 15(iPhone 15) సిరీస్ మోడల్ ఫోన్ విడుదల కానుంది. ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌ను సెప్టెంబర్‌లో విడుదల చేయనుంది. లాంచ్ టైమ్‌లైన్‌ను కంపెనీ అధికారికంగా ధృవీకరించలేదు. అయితే గత లాంచ్‌ల ఆధారంగా ఐఫోన్ 15 ఈవెంట్ సెప్టెంబర్ రెండు లేదా మూడవ వారంలో ఉంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో యాపిల్ కంపెనీ నాలుగు కొత్త ఐఫోన్ మోడళ్లను విడుదల చేయనుంది. ఐఫోన్ 15, 15 ప్లస్ రెండు మోడళ్లతో పాటు ఐఫోన్ 15 ప్రో సిరీస్‌ను కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 15 ప్రో మాక్స్ ప్రో కంటే మెరుగైన హార్డ్‌వేర్ సౌలభ్యం ఉంటుందని సమాచారం.
ఈ నేపథ్యంలో iPhone 15 ప్రో డిజైన్ మోడల్స్ కొన్ని వెలుగులోకి వచ్చాయి. రాబోయే ప్రీమియం ఐఫోన్ మోడల్‌లలో కొన్ని ప్రధాన డిజైన్ మార్పులు ఉంటాయని అందుబాటులో ఉన్న కొత్త డిజైన్స్ సూచిస్తున్నాయి. Apple iPhone 15 Pro మోడల్స్ 9 to 5 Macతోపాటు 15 ప్రో సిరీస్ రౌండర్ అంచులతో టైటానియం కేస్‌తో వస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు పోన్ బటన్లు, మ్యూట్ స్విచ్‌లకు బదులుగా Apple వాటిని సాలిడ్-స్టేట్ హాప్టిక్, మ్యూట్ బటన్లతో భర్తీ చేస్తున్నట్లు తెలిసింది. iPhone 7 సిరీస్, iPhone 8 సిరీస్ హోమ్ బటన్‌ను పోలి ఉంటాయని తెలుస్తోంది.
మరోవైపు ఆపిల్ ఈ కొత్త మోడల్లో ఎలాంటి సాఫ్ట్వేర్ ఉపయోగిస్తుందనే సమాచారం మాత్రం ఇంకా తెలియలేదు. ఐఫోన్ 15 సిరీస్ UBS టైప్-సి పోర్ట్ సౌలభ్యంతో రానుంది. ఐఫోన్‌లోని USB టైప్-సి పోర్ట్ కొన్ని పరిమితులను కలిగి ఉంటుందని ఇటీవల నివేదించబడింది. అలాగే, ప్రో మోడల్‌లు వేగవంతమైన USB 3.1ని పొందుతాయి. అయితే ప్రామాణిక మోడల్‌లు USB 2.0 పోర్ట్‌ను కలిగి ఉంటాయి.
ముందు భాగంలో 15 ప్రో మోడల్‌లు గతంలో కంటే చిన్న బెజెల్‌లను కలిగి ఉంటాయి. OLED డిస్ప్లే చుట్టూ ఉన్న బెజెల్‌లు కేవలం 1.55 మిమీని కల్గి ఉంటాయని తెలిసింది. వెనుక కెమెరా సెటప్ మూడు సెన్సార్లను కలిగి ఉంటుంది. ప్రోట్రూషన్ గతంలో కంటే పెద్దది. కెమెరా మాడ్యూల్ LiDAR సెన్సార్, LED ఫ్లాష్ మాడ్యూల్‌ను కూడా కలిగి ఉంది. రాబోయే ఐఫోన్ ప్రో కొత్త డీప్ రెడ్ కలర్ ఆప్షన్లో లాంచ్ అవుతుందని తెలిసింది. ఇది వైట్, స్పేస్ బ్లాక్, గోల్డ్ కలర్ ఆప్షన్లతో వస్తుందని సమాచారం.