చియాన్ విక్రమ్.. ఈ పేరు చెబితే ఎలాంటి క్యారెక్టర్ అయినా వణికిపోవాల్సిందే. ప్రస్తుతం విక్రమ్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో 'తంగలాన్' అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా.. గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
Bhagavanth Kesari OTT Streaming date and Release Partner
Thangalan: రిస్క్ అంటే విక్రమ్.. విక్రమ్ అంటేనే రిస్క్.. అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పాత్ర ఏదైనా సరే.. విక్రమ్ మేకోవర్ చూస్తే భయపడాల్సిందే. శివపుత్రుడు, అపరిచితుడు, ఐ లాంటి సినిమాల్లో విశ్వరూపం చూపించాడు విక్రమ్. గత కొన్నాళ్లుగా సరైన హిట్ అందుకోలేకపోతున్నాడు విక్రమ్. చాలా రోజుల తర్వాత విక్రమ్, హిట్ డైరెక్టర్ పా రంజిత్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. స్టూడియో గ్రీన్ నిర్మిస్తున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలున్నాయి. విక్రమ్ కెరీర్లోనే మోస్ట్ హైప్డ్ మూవీగా తంగలాన్ తెరకెక్కుతోంది. కెజియఫ్‌లో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతోంది.
ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. నిమిషమున్నర నిడివితో కట్ చేసిన తంగలాన్ టీజర్ మామూలుగా లేదు. ఫ్రేమ్ టు ఫ్రేమ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. విక్రమ్ గెటప్, ఆ బ్యాక్ డ్రాప్ వణుకు పుట్టించేలా ఉంది. అసలు విక్రమ్‌ను చూస్తే.. సినిమాలో అతని యాక్టింగ్ పీక్స్‌లో ఉందనేలా టీజర్ కట్ చేశారు. జీవీ ప్రకాష్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. గ్రాఫిక్స్ కూడా చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయి. ముఖ్యంగా.. విక్రమ్ పాముని చేత్తోనే ముక్కలు చేసే సీన్ అయితే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఖచ్చితంగా విక్రమ్ ఈ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేయడం గ్యారెంటీ. ఈ సినిమాను వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న రిలీజ్ చేస్తున్నట్లు రీసెంట్గా మేకర్స్ ప్రకటించారు. నవంబర్ 1న టీజర్ రిలీజ్ చేస్తామని చెప్పినట్టుగానే.. గూస్ బంప్స్ టీజర్ రిలీజ్ చేశారు. దీంతో తంగలాన్ పై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రంలో విక్రమ్ సరసన మాళవిక మోహనన్ హీరోయిన్గా నటిస్తోంది.