»Shobha Shetty In Danger Zone For 9th Week Bigg Boss Elimination
Shobha: లాస్ట్ వీక్ తప్పించుకున్నా, ఈ వీక్ వేటు తప్పేలా లేదు..!
బిగ్ బాస్ సీజన్ 7 హాట్ హాట్‌గా జరుగుతోంది. 8వ వారంలో ఎలిమినేషన్ నుంచి శోభా శెట్టి రెప్పపాటులో తప్పించుకున్నారు. 9వ వారంలో తప్పకుండా ఎలిమినేట్ అవుతుందని తెలుస్తోంది.
Shobha Shetty in danger zone for 9th week Bigg Boss elimination
Shobha Shetty: బిగ్ బాస్ సీజన్ 7 ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఉల్టా, పల్టా అంటూ ఈ సీజన్ ని భిన్నంగా తీసుకురాగా, ప్రేక్షకులను నచ్చుతోంది. ఇప్పటికే ఎనిమిది వారాలు పూర్తయ్యాయి. తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టారు. వారం మొదలు కాగానే, వీకెండ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం తెలిసిపోతోంది. తాజాగా కూడా ఈ విషయం లీక్ అయిపోవడం విశేషం. గతవారం సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యాడు. చాలా మంది శోభా శెట్టి ఎలిమినేట్ అవ్వాలని అనుకున్నారు. సందీప్ అయ్యాడు.
గత వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నా, ఈ వారం మాత్రం శోభా నామినేట్ అవ్వడం మాత్రం పక్కా అని తెలుస్తోంది. బిగ్ బాస్ ఎలిమినేషన్ 9వ వారంలో శోభాశెట్టి డేంజర్ జోన్లో ఉన్నారు. బిగ్ బాస్ తెలుగు 7 తాజా ఎపిసోడ్లో ప్రిన్స్ యావర్, భోలే షావలి, టేస్టీ తేజ, అమర్దీప్ చౌదరి, అర్జున్ అంబటి, రాతిక రోజ్, ప్రియాంక , శోభా శెట్టి ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. అన్ని అనధికారిక పోలింగ్ జాబితాల ప్రకారం శోభ చివరి స్థానంలో ఉన్నట్లు చెబుతున్నారు.
బిగ్ బాస్ ఎలిమినేషన్ 9వ వారంలో శోభాశెట్టి డేంజర్ జోన్లో ఉన్నారు. గత వారం కూడా, ఆమె చివరి నుంచి 2 వ స్థానంలో ఉంది. సందీప్ ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం ఏదైనా సానుకూలంగా మారితే తప్ప, ప్రస్తుత ట్రెండ్ నుండి ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.
బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ తొమ్మిదో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ మంగళవారం రాత్రి 10.30 గంటలకు ప్రారంభమైంది. ఇది మొదటి నుంచి ఊహించని రీతిలో సాగుతోంది. ముఖ్యంగా, స్ట్రాంగ్ ప్లేయర్‌గా మారిన ప్రిన్స్ యావర్‌కు ప్రేక్షకులు అద్భుతమైన ఓట్ల లెక్కింపును నమోదు అవుతున్నాయి. ఓటింగ్‌లో ప్రిన్స్ యావర్ తర్వాత అమర్దీప్ చౌదరి రెండో స్థానంలో కొనసాగుతున్నట్లు సమాచారం. కింది రెండు స్థానాల్లో చాలా మార్పులు ఉన్నాయి. భోలే షావలి ఇప్పుడు మూడో స్థానంలో, రతిక రోజ్ నాలుగో స్థానంలో, అంబటి అర్జున్ ఐదో స్థానంలో ఉన్నారు.
తొమ్మిదో వారం ఓటింగ్‌లో టేస్టీ తేజ ఆరో స్థానానికి పడిపోయిన సంగతి తెలిసిందే. ప్రియాంక జైన్ ఏడో స్థానంలో ఉండగా, శోభా శెట్టి ఎనిమిదో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం శోభ డేంజర్ జోన్లో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. చాలా మంది భోలే జాబితాలో అట్టడుగున ఉంటారని భావించారు. ఆయనకు ఊహించని రీతిలో ఓటింగ్ వస్తున్నట్లు టాక్.
బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ ఎలిమినేషన్ 9వ వారంలో కార్తీక దీపం ఫేమ్ మోనిత అకా అలియాస్ శోభా శెట్టి డేంజర్ జోన్లో ఉన్నట్లు కనిపిస్తోంది.చాలా మటుకు, ఆమె ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.