సూపర్ స్టార్ రజనీకాంత్‌ను అప్పుడప్పుడు నెగటివ్ టచ్‌లో చూస్తునే ఉంటాం. పలు సినిమాల్లో నెగెటివ్ షేడ్స్‌లో కనిపించారు తలైవా. చివరగా రోబో సినిమాలో నెగెటివ్ టాచ్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు లోకేష్ సినిమాలోను మరోసారి విలనిజాన్ని బయటికి తీసుకురాబోతున్నాడు.
రీసెంట్గా జైలర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు సూపర్ స్టార్ రజనీ కాంత్(Rajinikanth). నెల్సన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా తర్వాత లాల్ సలామ్ అనే సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం మాత్రం తలైవా 170తో బిజీగా ఉన్నాడు. జై భీమ్ ఫేం డైరెక్టర్ టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ సినిమా తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో తలైవార్ 171 ప్రాజెక్ట్ స్టార్ట్ కానుంది. ఇప్పటికే అఫిషీయల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. రీసెంట్గా లోకేష్ నుంచి వచ్చిన లియో సినిమా బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ రిజల్ట్ అందుకుంది. అయినా కూడా భారీ వసూళ్లను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు 540 కోట్లు రాబట్టినట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు.
అయితే లియో ప్రమోషన్స్‌లో భాగంగా లోకేష్(Lokesh) కనగరాజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా లోకే ష్ తన అప్ కమింగ్ ఫిల్మ్ రజనీ కాంత్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అసలు లోకేష్ తన సినిమాలో రజనీని ఎలా చూపించబోతున్నాడనే అసక్తి అందరిలోనుంది. ఈ క్రమంలో లోకేష్ సాలిడ్ హింట్ ఇచ్చేశాడు. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రజినీకాంత్‌లోని విలనిజం అంటే తనకు చాలా ఇష్టమని, నెక్ట్స్ సినిమాలో తలైవాలోని నెగెటివ్ షేడ్స్‌ను మరోసారి చూపించబోతున్నానని చెప్పుకొచ్చాడు. అలాగే.. రోబో సినిమా తర్వాత తలైవా 171లో సూపర్ స్టార్ విలనిజాన్ని ఎలివేట్ చేయబోతున్నాను.. ఆయన పాత్రకు చాలా షేడ్స్ ఉన్నాయని అన్నాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.