ప్రముఖ నటి నయనతార(Nayanthara) 75వ చిత్రం షూటింగ్ మొదలైంది. అయితే గ్రేట్ డైరెక్టర్ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన నీలేష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ మేరకు షూటింగ్ స్పాట్ నుంచి నీలేష్ కృష్ణ ఓ వీడియోను పంచుకున్నారు.
నటిగా 75 చిత్రాలకు చేరుకున్న దక్షిణాది అగ్ర కథానాయిక నయనతార(Nayanthara) తాజా చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. అయితే నయన్ యాక్ట్ చేస్తున్న 75వ చిత్రానికి గ్రేట్ డైరెక్టర్ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన నీలేష్ కృష్ణ(Nilesh Krishnaa) దర్శకత్వం చేయడం విశేషం. ఈ చిత్రంలో నయనతారతో పాటు జై ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 2013లో తమిళ చిత్రం ‘రాజా రాణి’ కోసం వీరిద్దరు కలిసి యాక్ట్ చేశారు. మళ్లీ 10 ఏళ్ల తర్వాత కలిసి నటించబోతున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ సత్యన్ సూర్యన్, ప్రవీణ్ ఆంటోని చేయనున్నారు.
నయనతార 75వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న నీలేష్ కృష్ణ.. ఈ సినిమాతో తమిళంలో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. నటి నయనతారతో పాటు, నటులు జై, సత్యరాజ్, రెడిన్ కింగ్స్లీ కూడా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది చివరికల్లా సినిమా షూటింగ్‌ను పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్(Zee Studios), ట్రైడెంట్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో మొదలైంది.
అయితే ఈ చిత్రానికి ‘లేడీ సూపర్ స్టార్ 75′(Lady Superstar 75)అనే తాత్కాలిక టైటిల్‌తో అధికారికంగా ప్రారంభించబడింది. తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆశీస్సులతో ‘లేడీ సూపర్ స్టార్ 75’ను ప్రారంభించారు. నీలేష్ కృష్ణ, అతని బృందం సూపర్ స్టార్ రజనీకాంత్‌ను అతని ఇంట్లో కలిసి ఆశీర్వాదం తీసుకున్న చిత్రాలను ఈ మేరకు పంచుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి రజనీకాంత్ శుభాకాంక్షలు తెలియజేస్తూ క్లాప్బోర్డ్పై ఓ పదం రాశారు. ఈ క్రమంలో నీలేష్ కృష్ణ గతంలో దర్శకుడు శంకర్‌కి అసోసియేట్‌గా ఉండేవారని, ఆయన తన గురువైన శంకర్ దర్శకత్వంలో 2018లో విడుదలైన ‘2.0’లో రజనీకాంత్‌తో కలిసి పనిచేశారని చెప్పారు.
నటి నయనతార(Nayanthara) పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో బిజీగా నటిస్తోంది. ప్రస్తుతం నయన్(Nayanthara) యాక్ట్ చేసిన జవాన్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు అహ్మద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లార్డ్ సినిమాలో జయం రవి సరసన నయనతార నటించింది. జూన్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Lady Superstar’s ‘Nayanthara 75’ shooting started with the blessings of Superstar. pic.twitter.com/06VZAOgwYV