Love Story: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రేమ కథ తెలుసా?
అంబానీ కుటుంబంలో కొత్త సభ్యులు చేరారు. అనంత్ అంబానీతో రాధికకు నిశ్చితార్థం ఎప్పుడో జరిగింది. వీరిది ప్రేమ వివాహం అనే విషయం మీకు తెలుసా? మరి వీరి ప్రేమ కథ ఎలా మొదలైందో చూద్దాం.
భారతదేశపు అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ , నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ గతేడాది డిసెంబర్లో నిశ్చితార్థం చేసుకున్నారు. రాధిక మర్చంట్‌తో అనంత్ అంబానీ నిశ్చితార్థం వార్త బయటకు రాగానే, వారి ప్రేమ కథను తెలుసుకోవాలని ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. రాధిక మర్చంట్ , అనంత్ అంబానీల ప్రేమ కథ ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం.
రాధిక మర్చంట్ ఎవరు? :
రాధిక మర్చంట్ గుజరాత్‌కు చెందిన పెద్ద వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె. వీరేన్ మర్చంట్ ప్రధానంగా గుజరాత్‌లోని కచ్‌కు చెందినవాడు. అతను ADF ఫుడ్స్ లిమిటెడ్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఎన్కోర్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ CEO, వైస్ ఛైర్మన్.
చిన్ననాటి స్నేహితులు :
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ చిన్ననాటి స్నేహితులు. స్నేహం నుంచి అది ప్రేమగా మారింది. వారు చాలా సంవత్సరాలు డేటింగ్ కూడా చేశారు. చదువు పూర్తయ్యాక అనంత్ అంబానీ ఉన్నత విద్య కోసం రోడ్ ఐలాండ్‌లోని బ్రౌన్ యూనివర్సిటీకి వెళ్లారు. రాధిక మర్చంట్ న్యూయార్క్ యూనివర్సిటీకి వెళ్లింది. ఇండియాకి తిరిగొచ్చాక మళ్లీ దగ్గరయ్యారు.
అంబానీ కుటుంబంతో రాధిక:
ఒకసారి రాధిక, అనంత్ ఒకే రంగులో దుస్తులు ధరించి ఫోటోకి ఫోజులిచ్చారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వారిద్దరి మధ్య ఏదో నడుస్తోందనే ప్రచారం జరిగింది. తర్వాత రాధికా మర్చంట్… ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ వివాహానికి హాజరయ్యారు. ఆ తర్వాత ఈ పుకార్లకు బలం చేకూరింది. ఇది మాత్రమే కాదు, ఇటలీలోని లేక్ కోమోలో జరిగిన ఇషా అంబానీ నిశ్చితార్థంలో కూడా రాధికా మర్చంట్ కనిపించింది. అనంత్ అంబానీతో కలిసి ఎర్రటి దుస్తుల్లో కెమెరాకు చిక్కారు. ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా కుమారుడు పృథ్వీ మొదటి పుట్టినరోజు వేడుకలో రాధికా మర్చంట్ కూడా కనిపించింది.
రాధిక, నీతా అంబానీల మధ్య బంధం కూడా చాలా బాగుంటుందట. రాధిక, నీతా తరచుగా వివాహ వేడుకలలో కలిసి కనిపిస్తారు. అంబానీ కుటుంబంలో జరిగే అన్ని కార్యక్రమాలకు రాధిక హాజరవుతారు. శ్లోకలాగే కుటుంబంలో తమ బాధ్యతలను నిర్వర్తిస్తారు. శ్లోకా మెహతా , రాధిక మర్చంట్ లు కూడా సొంత సోదరీమణుల కంటే ఎక్కువ ప్రేమ చూపించుకుంటారట.