»Iftar Dinner At Lb Stadium Hyderabad April 12th 2023 Evening Traffic Restrictions
Iftar dinner: రేపు ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు..సాయంత్రం ట్రాఫిక్ ఆంక్షలు
రేపు(ఏప్రిల్ 12న) ఎల్బీ స్టేడియం(LB Stadium)లో నిర్వహించనున్న దావత్ ఇఫ్తార్ కార్యక్రమంలో సీఎం కేసీఆర్(cm kcr) పాల్గొననున్నారు. ఈ క్రమంలో రేపు హైదరాబాద్(hyderabad)లో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
రేపు (ఏప్రిల్ 12న) ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు(cm kcr) ఎల్బీ స్టేడియం(LB Stadium)లో నిర్వహించనున్న దావత్-ఎ-ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు(traffic restrictions) ఉంటాయని వెల్లడించారు. ఈ క్రమంలో ట్రాఫిక్ ఆంక్షలు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అమల్లో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో చాపెల్ రోడ్, నాంపల్లి నుంచి వచ్చే వాహనాల ట్రాఫిక్… BJR విగ్రహం, ట్రాఫిక్ AR పెట్రోల్ పంప్ వద్ద PCR వైపు మళ్లించబడనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు(traffic police) తెలిపారు. మరోవైపు SBI గన్‌ఫౌండ్రీ వైపు నుంచి ప్రెస్ క్లబ్/బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వైపు వెళ్లే వాహనాలు.. SBI గన్‌ఫౌండ్రీ వద్ద చాపెల్ రోడ్ వైపు మళ్లించబడతాయని చెప్పారు.
దీంతోపాటు రవీంద్ర భారతి, హిల్ ఫోర్ట్ రోడ్డు నుంచి బిజెఆర్(BJR) విగ్రహం వైపు వెళ్లాలని భావించే వాహనదారులు… ఫతే మైదాన్‌లోని కెఎల్కె బిల్డింగ్‌లోని సుజాత హైస్కూల్ వైపు వెళ్లాలని వాహనదారులకు సూచించారు. ఈ నేపథ్యంలో బషీర్‌బాగ్ ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్ BJR విగ్రహం వద్ద కుడి మలుపు తీసుకోవడానికి అనుమతించబడదని అధికారులు స్పష్టం చేశారు.
అదే విధంగా నారాయణగూడ శ్మశానవాటిక నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను.. పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద హిమాయత్‌నగర్ వై జంక్షన్(y junction) వైపు మళ్లించనున్నారు. కింగ్ కోటి, బొగ్గుల కుంట నుంచి భారతీయ విద్యాభవన్ మీదుగా బషీర్‌బాగ్‌కు వెళ్లే వాహనాలను.. కింగ్ కోటి కూడలి వద్ద తాజ్‌మహల్, ఈడెన్ గార్డెన్ వైపు మళ్లిస్తారు. బషీర్‌బాగ్ నుంచి పీసీఆర్ వైపు వచ్చే వాహనాలను బషీర్‌బాగ్ వద్ద లిబర్టీ వైపు మళ్లిస్తారు. ఈ నేపథ్యంలో ప్రజలు(people) సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు(traffic police) కోరారు.