»If You Dance Ice Cream Free Indiranagar Bengaluru Karnataka
Viral Video: డాన్స్ చేస్తే..ఐస్ క్రీం ఫ్రీ!
మీరెప్పుడైనా ఐస్ క్రీం ఫ్రీగా తీసుకున్నారా? లేదా అయితే ఇటివల ఓ నగరంలో డాన్స్ చేసిన వారికి ఐస్ క్రీంను ఉచితంగా అందించారు. అయితే అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది.
ఎవరైనా సరదాగా డాన్స్(dance) చేస్తే క్లాప్స్ కొడతారు. కానీ బెంగళూరులోని ఓ ఐస్ క్రీం షాపు వారు మాత్రం డాన్స్ చేసిన వారికి ఫ్రీగా ఐస్ క్రీమ్స్ అందించారు. అయితే ఆ షాపుకు వచ్చిన కస్టమర్లు డాన్స్ చేసిన వీడియో తాజాగా సీసీ కెమెరాల ద్వారా బయటకొచ్చింది. వీడియోలో కస్టమర్లు డాన్స్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్స్ తీసుకుని వెళ్లడం చూడవచ్చు. కస్టమర్లు పలురకాలుగా డాన్స్ చేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
అయితే ఈ ఐస్ క్రీం ఆఫర్ ప్రతి రోజు కాదండోయ్. కేవంలం ఐస్ క్రీం డే అయిన జూలై 16న ఈ ఆఫర్ ప్రకటించారు. తర్వాత యథావిధిగా మనీ పే చేయాల్సిందేనని ఆ షాపు నిర్వహకులు స్పష్టం చేశారు. ఏదైతే ఏంటీ ఐస్ క్రీం ప్రియులు మాత్రం ఈ అవకాశాన్ని ఉత్సాహంగా వినియోగించుకుని ఎంజాయ్ చేశారు. బెంగళూరులోని ఇందిరానగర్ బ్రాంచ్లో ఈ ఐస్క్రీం డేను నిర్వహించారు. ఈ ప్రయత్నం పట్ల పలువురు కస్టమర్లు సంతోషం వ్యక్తం చేశారు. చాలా సంతోషాన్ని కలిగించిందని, మరికొంత మంది తన కాలేజీ రోజులు గుర్తుకొచ్చాయని అన్నారు.