Lord Shiva: సాక్షాత్తు శ్రీకృష్ణున్ని (Lord Krishna) భర్తగా భావించి పెళ్లి చేసుకున్న మీరా బాయి(mirabai) గురించి తెలుసు. అలాగే పరమేశ్వరుడిని(Lord Shiva) నిత్యం ఆరాధిస్తూ శివున్నే భర్తగా స్వీకరించిన అక్క మహాదేవి(Akka Mahadevi) గురించి మనకు చరిత్ర చెబుతుంది. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి ఉత్తర్ప్రదేశ్(Uttar Pradesh)లో చోటుచేసుకుంది. ఝాన్సీ జిల్లాకు చెందిన ఓ యువతి పరమశివుడిని భర్తగా స్వీకరించింది. భగవంతుడు అంటే భక్తితో పశుపతిని పతిగా భావించి పెళ్లి చేసుకుంది(married Lord Shiva). ఈ ఘటన స్థానికంగానే కాదు దేశమంతటా చర్చనీయంగా మారింది. స్థానిక జిల్లాలోని అన్నపూర్ణ కాలనీకి చెందిన యువతి, ఆమె తల్లిదండ్రులు ఎన్నో ఎళ్లుగా ఏళ్లుగా బ్రహ్మకుమారి సంస్థతో అనుబంధాన్ని కలిగి ఉన్నారు. పరమేశ్వరుడు అంటే వారికి పరమభక్తి. వీరి అడుగుజాడల్లోనే చిన్నప్పుటి నుంచి భక్తిశ్రద్దలతో పెరిగిన వారి కుమార్తే శివుడిపై మమకారాన్ని పెంచుకుంది. ఇకపై ఆయనే సర్వస్వం అని పెళ్లి చేసుకోవాలనుకుంది.
ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారు మొదట సంశయించినా.. తరువాత సంతోషంతో వారు వివాహానికి అంగీకరించడంతో సదరు యువతి తన జీవితాన్ని పరమశివునికి అంకితం చేయాలని నిశ్చయించుకుంది. ఇక దేవుడితో పెళ్లి అంటే ఎలా ఉంటుంది. ఎవరు చేస్తారు అనే ఆసక్తి అందరిలోను ఉంటుంది. అలాగే స్థానికుల్లో కూడా కలిగింది. అందుకు తగ్గట్టుగానే నెల రోజుల ముందునుంచే ఆ కార్యక్రమానికి కావాల్సిన అన్ని విషయాలను క్షుణ్ణంగా తెలుసుకొని ఇప్పుడు జరుగుతున్నట్లుగానే అట్టహాసంగా జరిపించారు. సంప్రదాయం ప్రకారం ముందుగా ఆహ్వాన పత్రికలను అచ్చు వేయించి బంధువులకు పంచారు. తరువాత పురోహితుల సమక్షంలో వధువుకు శివుడికి వివాహం జరిపించారు. తరువాత వచ్చినవారందరికి భోజనాలు పెట్టించారు. ప్రస్తుతం ఈ విషయం అందరిలో ఆసక్తిని రేపుతుంది.