Elon Musk Reveals Plan To Turn X Into A Dating Feature
Twitter logo: ట్విట్టర్లో (Twitter) పలు మార్పులు చేస్తున్నారు ఎలాన్ మస్క్. ఇప్పుడు లోగో కూడా మార్చేశారు. ఇప్పటివరకు నీలి రంగులో పిట్ట ఉండేది.. ఇప్పుడు ఆ స్థానంలో బ్లాక్ షాడో ఉండగా.. తెలుపు రంగులో ఎక్స్ వచ్చి చేరింది. లోగోను ట్విట్టర్ యజమాని మస్క్, సీఈవో లిండా కలిసి ఆవిష్కరించారు.
ట్విట్టర్ (Twitter) శాన్ ప్రాన్సిస్కో కార్యాలయం వద్ద కూడా లోగోను మార్చారు. గత ఏడాది మస్క్ ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మార్పుల ప్రక్రియ కొనసాగుతోంది. లోగో మార్పు గురించి నిన్నటి నుంచే మస్క్ హింట్ ఇస్తూ వస్తున్నారు. సోమవారం ప్రపంచ వ్యాప్తంగా ఛేంజ్ చేయాలని అనుకుంటన్నా అని పోస్ట్ చేశారు. ట్విట్టర్ (Twitter) బ్రాండ్, పక్షులకు వీడ్కోలు పలుకుతాం అని ప్రకటించారు. అనుకున్నట్టు లోగో ఛేంజ్ చేశారు. లోగోతోపాటు డొమైన్ పేరు కూడా మారింది. అంతకుముందు ట్విట్టర్.కామ్ ఉండగా.. అదీ ఇప్పుడు ఎక్స్.కామ్‌గా మారింది.
లోగో మార్చారో లేదో గుడ్ బై ట్విట్టర్ (Twitter) హ్యాష్ టాగ్ ట్రెండ్ అవుతోంది. పాత లోగో స్థానంలో కొత్తది తీసుకురావడాన్ని కొందరు యూజర్లు విమర్శిస్తున్నారు. అంతకుముందు లోగో మార్పునకు సంబంధించి తన ఫాలొవర్లను మస్క్ అడిగారు. సైట్ కలర్ బ్లూ నుంచి బ్లాక్‌కు మార్చడంతో ఇష్టపడతారో లేదోనని సందేహాం వ్యక్తం చేశాడు. ఆయన ఊహించినట్టే జరిగింది.