»Emblem Of The State Should Bear The Symbols Of The Sacrifices Of The People
Revanth Reddy: రాష్ట్ర చిహ్నాంలో ప్రజల త్యాగాల గుర్తులు ఉండాలె
తెలంగాణ ప్రాంత ప్రజల పోరాటంలో న్యాయం ఉందని నమ్మి, విశ్వసించి.. ప్రత్యేక రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చారని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కానీ ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ విస్మరించారని విమర్శించారు.
Emblem Of The State Should Bear The Symbols Of The Sacrifices Of The People
Revanth Reddy: తెలంగాణ రాష్ట్రం కోసం యువకులు ఆత్మబలిదానం చేశారని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) గుర్తు చేశారు. రాష్ట్ర చిహ్నంలో ప్రజల త్యాగాల గుర్తులు ఉండాలని స్పష్టం చేశారు. హైదరాబాద్లో మీడియాతో రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాట్లాడారు. కేసీఆర్ పాలనపై రైతులు, మహిళలు, యువత ఆగ్రహాంతో ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు భయపడే పరిస్థితి నెలకొందని విమర్శించారు.
తెలంగాణ ప్రాంత ప్రజల పోరాటంలో న్యాయం ఉందని నమ్మి సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కానీ ఏం జరిగింది.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని విమర్శించారు. పదేళ్లలో సీఎం కేసీఆర్ ఏం చేయలేదని విరుచుకుపడ్డారు. పేదల సంక్షేమం కోసం నిధులు ఉపయోగపడలేదని విరుచుకుపడ్డారు. నిరసన తెలిపే ప్రాథమిక హక్కులను ప్రభుత్వం కాలరాసిందని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో కొలువులు వస్తాయని, అభివృద్ధి జరుగుతుందని యువత కలలు కనిందని గుర్తుచేశారు. కానీ అలా ఏమీ జరగలేదని మండిపడ్డారు. ఉద్యోగాల కల్పనలో సర్వీస్ కమిషన్ ఫెయిల్ అయ్యిందని రేవంత్ ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేని పరిస్థితిలో కేసీఆర్ ఉన్నారని విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల వేళ.. ప్రచార పర్వంలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళుతోంది. అగ్రనేత రాహుల్ గాంధీ జోరుగా ప్రచారం చేస్తున్నారు. దీంతో శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.