»Huge Earthquake In Peru And Ecuador 14 People Died 380 Members Injured
Earthquake: పెరూ, ఈక్వెడార్ లో భారీ భూకంపం..14 మంది మృతి
దక్షిణ ఈక్వెడార్(Ecuador), ఉత్తర పెరూ(Peru)లో శనివారం బలమైన భూకంపం(earthquake) సంభవించింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా, 380 మందికిపైగా గాయపడ్డారని అక్కడి మీడియా తెలిపింది. సమాచారం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది(rescue employees) ఘటనా స్థలానికి చేరుకుని శిథిలాల క్రింద చిక్కుకున్నవారిని తొలగిస్తున్నారు. ఈ క్రమంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈక్వెడార్(Ecuador), ఉత్తర పెరూ(Peru) తీర ప్రాంతాన్ని శనివారం భారీ భూకంపం(earthquake) కుదిపేసింది. దీంతో ఎల్ ఓరో ప్రావిన్స్‌లో 14 మంది మరణించారని, 380 మందికి పైగా గాయపడ్డారని అక్కడి ప్రెసిడెన్సీ కమ్యూనికేషన్ ఏజెన్సీ తెలిపింది. మరోవైపు 44 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని.. మరో 90 ఇళ్లు స్వల్పంగా దెబ్బతిన్నాయని ప్రకటించారు. ఈ క్రమంలో అనేక గృహాలు, పాఠశాలలు, వైద్య కేంద్రాలకు నష్టం ఏర్పడినట్లు వెల్లడించారు. బాధితుల్లో ఒకరు పెరూలో మరణించగా, ఈక్వెడార్‌లో 13 మంది మరణించారని తెలుస్తోంది.
సమాచారం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది(rescue employees) ఘటనా స్థలానికి చేరుకుని శిథిలాల క్రింద చిక్కుకున్నవారిని తొలగిస్తున్నారు. మచాల కమ్యూనిటీలో ప్రజలు ఖాళీ చేయకముందే రెండంతస్తుల ఇల్లు కూలిపోయిందని అధికారులుల తెలిపారు. భవనం గోడలు పగుళ్లు ఏర్పడి పెద్ద సంఖ్యలో ప్రజలు ఆ భవనంలో చిక్కుకుపోయారని అన్నారు. ఈ క్రమంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
యుఎస్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం 6.8 తీవ్రతతో ఈ భూకంపం సంభవించినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. గుయాస్ ప్రావిన్స్‌లోని బాలావో నగరానికి 10 కిమీ (6.2 మైళ్లు) దూరంలో 66.4 కిమీ (41.3 మైళ్లు) లోతులో భూకంప ప్రకంపనలు వచ్చినట్లు వెల్లడించారు. మరోవైపు భూకంపం కారణంగా కొండచరియలు విరిగిపడటంతో పలుచోట్ల రహదారులు మూసుకుపోయాయి. శాంటా రోసా విమానాశ్రయానికి స్వల్ప నష్టం వాటిల్లింది.
భూకంపం సంభవించే క్రమంలో మేమంతా వీధుల్లోకి పరుగులు తీశామని అక్కడి స్థానికులు తెలిపారు. చాలా భయపడ్డామని కొన్ని ఇళ్లు కూలిపోయాయని భూకంప కేంద్రానికి(earthquake centre) సమీపంలో ఉన్న ఇస్లా పునా నివాసి వెల్లడించారు. భూకంపం వల్ల సంభవించిన నష్టాన్ని ధృవీకరించడంతోపాటు తాము బాధితులకు అండగా ఉంటామని సంఘీభావం తెలుపుతు ఈక్వెడార్ అధ్యక్షుడు గిల్లెర్మో లాస్సో ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.