W.G: సరిపల్లి పద్మశ్రీ కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యపై సీపీఎం ఆధ్వర్యంలో గురువారం నిరసన వ్యక్తమైంది. ప్రజా చైతన్య పాదయాత్రలో భాగంగా కాలనీకి చేరుకున్న బృందానికి మహిళలు తమ గోడును విన్నవించారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రోడ్డుపై ఖాళీ బిందెలతో కూర్చొని ఆందోళన చేపట్టారు. నీటి సమస్యను పరిష్కరించి కాలనీవాసులను ఆదుకోవాలని సీపీఎం నాయకులు కోరారు.