టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్(ram charan) విరాట్ కోహ్లీ(Virat Kohli) స్పోర్ట్స్ బయోపిక్(Biopic)లో పనిచేయాలని ఉందని తన కోరికను వ్యక్తపరిచాడు. శుక్రవారం ఢిల్లీ చేరుకున్న రామ్ చరణ్ ఇండియా టుడే కాంక్లేవ్‌లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది తెలిసిన విరాట్, చరణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మెగా పవర్ స్టార్, టాలీవుడ్ హీరో రామ్ చరణ్(Ram Charan) ప్రస్తుతం గ్లోబల్ స్టార్ అయ్యారు. RRR చిత్రానికి ఆస్కార్ వచ్చిన తర్వాత ఈ హీరో క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ స్పోర్ట్స్ బయోపిక్(biopic)లో పనిచేయాలని తనకు చాలా రోజుల నుంచి ఉందని తన కోరికను వ్యక్తపరిచాడు. ఒకవేళ తనకు అవకాశం వస్తే భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి పాత్రను చేయడానికి ఇష్టపడతానని స్పష్టం చేశాడు. విరాట్ కోహ్లీ(Virat Kohli) ఒక అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని.. అవకాశం వస్తే అతని బయోపిక్ లో నటిస్తానని అన్నారు. అంతేకాదు తాను కొంచెం కోహ్లీ మాదిరిగా ఉంటానని.. అది అద్భుతంగా ఉంటుందని కూడా భావిస్తున్నట్లు చెర్రీ వెల్లడించారు. శుక్రవారం అమెరికా నుంచి ఢిల్లీ)(delhi) వచ్చిన రామ్ చరణ్(Ram Charan) ఇండియా టుడే కాంక్లేవ్‌లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలో ఇది తెలిసిన విరాట్, చరణ్ అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. రామ్ చరణ్ కోహ్లీ(Virat Kohli) క్యారెక్టర్లో కరెక్టుగా సెట్ అవుతారని అంటున్నారు. దీంతోపాటు చెర్రీ ఫిట్ నెస్ కూడా అందుకు ఓ కారణమని చెబుతున్నారు. మరి తన బయోపిక్ సినిమాపై విరాట్ కోహ్లీ ఎలా స్పందిస్తారో చూడాలి. ఏదీ ఏమైనా కోహ్లీ బయోపిక్ వస్తే మాత్రం మాములుగా ఉండదు. పక్కా హిట్టు అవుతుందని ఇంకొంత మంది ఫ్యాన్స్ అంటున్నారు.
మరోవైపు టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొదటి ODIలో విరాట్(Virat) నాటు నాటు పాటకు హుక్ స్టెప్ వేసిన ఓ క్రేజీ వీడియో వెలుగులోకి వచ్చింది. మ్యాచ్ జరుగుతున్న క్రమంలోనే కోహ్లీ ఈ స్టెప్స్ వేయడం వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కోడుతుంది. అయితే ఈ వీడియో చూసిన కొంతమంది.. రామ్ చరణ్ చెప్పిన దానికి విరాట్ కోహ్లీ ఓకే చెప్పాడని చెబుతున్నారు.