ఒక కార్యక్రమం అమలు చేస్తే 2030 సంవత్సరం వరకు భారతదేశం దివాళా తీస్తుందని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని ఒక వాట్సప్ సందేశం ద్వారా తెలిసిందని పేర్కొన్నారు. అందుకనే ఆ పద్ధతి అమలు చేయట్లేదని ప్రకటించారు. ఆయన పాత పింఛన్ విధానం (ఓపీఎస్)పై మాట్లాడారు. పాత పింఛన్ విధానం అమలు చేయొద్దని కోరారు. చండీగడ్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఖట్టర్ ఓపీఎస్ పై విధానంపై మాట్లాడారు.
‘మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్త. 2006లో ఓపీఎస్ విధానాన్ని మన్మోహన్ సింగ్ అంతటి వ్యక్తే వ్యతిరేకించారు. ఓపీఎస్ తో భారత్ తిరోగమనంలోకి నెడుతుందని చెప్పారు. నిన్న నాకు వాట్సప్ లో ఓ సందేశం వచ్చింది. ఓపీఎస్ ను అమలు చేస్తే 2030 కల్లా దేశం దివాళా తీస్తుందని ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి తెలిపారు. అందుకే ఈ పాత పింఛన్ అమలు అనేది ప్రమాదకరం. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కొత్త పింఛన్ విధానం తీసుకొచ్చిందని గుర్తు చేశారు. కాగా, పాత పింఛన్ విధానం అమలు చేస్తామని చాలా రాష్ట్రాలు ప్రకటించాయి. రాజస్థాన్, చత్తీస్ ఘడ్, ఝార్ఖండ్ రాష్ట్రాలు ఓపీఎస్ విధానం పున:ప్రారంభిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుం ఆప్ అధికారంలో ఉన్న ఢిల్లీలోనూ ఈ విధానం అమలు చేసేందుకు చర్యలు మొదలయ్యాయి.