»Chandigarh Gangster Who Got Parole And Got Married To His Girlfriend
Gangster Marriage: పెరోల్ తీసుకుని ప్రియురాలిన పెళ్లాడిన గ్యాంగ్స్టర్
ఆరు గంటలు పెరోల్ తీసుకొ మరో లేడీ గ్యాంగ్స్టర్ అయిన తన ప్రియురాలిని పెళ్లాడిన గ్యాంగ్స్టర్. గ్యాంగ్స్టర్ సందీప్ అలియాస్ కలా జతేది వివాహం నెట్టింట్లో వైరల్గా మారింది.
Chandigarh gangster who got parole and got married to his girlfriend
Gangster Marriage: ఓ గ్యాంగ్స్టర్ జైలు నుంచి వచ్చి తన ప్రేయసిని పెళ్లాడిన ఘటన చండీఘడ్లో చోటుచేసుకుంది. గ్యాంగ్స్టర్ సందీప్ అలియాస్ కలా జతేది మంగళవారం మరో లేడీ గ్యాంగ్స్టర్ అనురాధ చౌదరీని పెళ్లి చేసుకున్నాడు. అనురాధ చౌదరీని మేడం మింజ్ అని అక్కడి స్థానికులు పిలుస్తారు. భారీ పోలీసుల బందోబస్తు నడుమ ఢిల్లీలో ఈ గ్యాంగ్స్టర్ పెళ్లి(Gangster Marriage) జరిగింది. హర్యానాలోని సోనిపట్ నుంచి ప్రత్యేకమైన ఎస్యూవీలో అనురాధ చౌదరీ వచ్చారు. కలా జతేది పెళ్లి కోసం ఆరు గంటల పెరోల్ తీసుకున్నాడు. అతని పెరోల్ ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ముగుస్తుంది.
ఈ గ్యాంగ్స్టర్ పెళ్లికి ఆయన తరుఫున లాయర్ పెరోల్ కావలంటూ న్యాయస్థానికి పిటిషన్ ఇచ్చారు. పిటిషన్ను విచారించిన న్యాయస్థానం అతనికి 6 గంటల పెరోల్ ఇచ్చింది. అయితే తాను పెళ్లి చేసుకోబే అమ్మాయి కూడా గ్యాంగ్స్టర్ కావడంతో అత్యంత కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య వీరి పెళ్లి జరిగింది. వీరి వెడ్డింగ్ తరువాత మళ్లీ సందీప్ తిరిగి జైలుకు వెళుతాడు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది. ఇలాంటి పెళ్లి వినడం మొదటిసారి అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.
Hist0ry-sh€€ter" Anuradha Choudhary alias 'Madam Minz' arrives at banquet hall in Delhi for marriage under heavy security deployment as her partner g@ ngster Sandeep alias Kala Jathedi lodged in Tihar jail is on 6-hour parole. pic.twitter.com/nHIiXzRJUx