»Girl Child Mission Shakti Scheme Second Girl Birth Give Rs 6000
Second girl birth: రెండో కాన్పులో అమ్మాయి పుడితే రూ.6 వేల సాయం
రెండు కాన్పులో అమ్మాయిల(girl child)ను వద్దనుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై రెండో ప్రసవంలో పాపాయి జన్మిస్తే రూ.6 వేల సాయం అందజేయనున్నట్లు ప్రకటించారు. మిషన్ శక్తి స్కీమ్ లో భాగంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
మిషన్ శక్తి కింద కేంద్రం కొత్త పథకాన్ని ప్రారంభించింది. మహిళలు(womens) రెండోసారి గర్భం దాల్చి ఆడపిల్ల పుడితే అర్హులకు రూ.6 వేలు ఆర్థిక సాయం అందజేయనున్నారు. ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన (PMVVY) కింద మొదటి డెలివరీ అమ్మాయి లేదా అబ్బాయి జన్మిస్తే మూడు దశల్లో రూ.5,000 చెల్లిస్తున్నారు. ఈ ప్రణాళికా వ్యయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు కేటాయిస్తాయి.
ఈ పథకంలో రెండో ప్రసవానికి గతంలో ఆర్థిక ప్రయోజనం వర్తించకపోగా.. ఇప్పుడు దాన్ని సవరిస్తూ రెండో కాన్పులో ఆడపిల్ల(girl child) పుడితేనే తల్లికి రూ.6 వేలు ఇచ్చేలా మార్చారు. రెండో జన్మలో కవలలు జన్మించినా, వారిలో ఒకరు ఆడపిల్ల అయినా ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం కింద ఒక మహిళ మొదటిసారి గర్భం అయిన తర్వాత ఆన్లైన్ నమోదు చేసుకంటే రూ.1,000 ఇస్తారు. అలాగే ఆరు నెలల తర్వాత రూ.2 వేలు, ప్రసవం అయిన 14 వారాలలోపు ఇమ్యునైజేషన్ సైకిల్ పూర్తి చేసిన తర్వాత మరో రూ.2,000 అందజేస్తారు.
ఈ సందర్భంగా గర్భిణులు ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ ప్రభుత్వ అధికారులు(officers) తెలిపారు. గర్భిణులు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా, కాపీలతో 12 వారాల్లోపు ఆసుపత్రుల్లో పేర్లు నమోదు చేసుకుంటే ఐదు వేలు విడతల వారీగా వారి ఖాతాల్లో జమ అవుతాయని వెల్లడించారు. అర్హులైన అభ్యర్థులకు జనన ధృవీకరణ పత్రం ఆధారంగా చెల్లించబడుతుంది. మొదటి గర్భానికి మూడు దశల్లో అందించే రూ.5 వేల ఆర్థిక సాయం పంపిణీలోనూ మార్పులు చేయనున్నారు. ప్రెగ్నెన్సీకి రూ.3,000, డెలివరీ తర్వాత 14 వారాలకు రూ.2,000 రెండు విడతలుగా ఇవ్వనున్నారు. ఈ పథకంలో చేరేందుకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు.
అర్హులు https://pmmvycas.nic.in/public/beneficiaryuseraccount/loginలింక్ ద్వారా నేరుగా పథకం వెబ్‌సైట్‌కి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. లబ్ధిదారులు నమోదు చేసుకుని అక్కడ లాగిన్ అవ్వాలి. మీరు పథకం కింద ప్రయోజనం పొందాలనుకుంటే LMP తేదీ ఖచ్చితంగా ఉండాలి. ఎంసీపీ కార్డు కావాలి. వీటిని ఆశా వర్కర్ నుంచి తీసుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ పథకం వర్తించదు. ఏపీలో కూడా అర్హులైన వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే నేరుగా వారి ఖాతాల్లోనే డబ్బులు జమ అవుతాయి.