Megastar Chiranjeevi Emotional On Granddaughter Birth
Megastar Chiranjeevi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన దంపతులకు అమ్మాయి జన్మించింది. దీంతో మెగా కుటుంబం, కామినేని కుటుంబం ఆనంద డోలికల్లో మునిగి తేలుతుంది. మెగా ఫ్యాన్స్ అయితే సంబరాలు చేసుకుంటున్నారు. అపోలో ఆస్పత్రి వద్ద సందడి వాతావరణం నెలకొంది. డెలివరీ జరిగిన వెంటనే తెల్లవారు జామున వచ్చి చూసిన చిరంజీవి (Chiranjeevi).. కాసేపటి క్రితం మరోసారి వచ్చారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
Welcome Little Mega Princess !! ❤️❤️❤️
You have spread cheer among the Mega Family of millions on your arrival as much as you have made the blessed parents @AlwaysRamCharan & @upasanakonidela and us grandparents, Happy and Proud!! 🤗😍
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 20, 2023
మంగళవారం రోజున అమ్మాయి పుట్టిందని.. ఆంజనేయస్వామిని విశ్వసిస్తామని చిరంజీవి (Chiranjeevi) తెలిపారు. ప్రత్యేకమైన మంగళవారం ఆడబిడ్డ జన్మించడాన్ని అపురూపంగా భావిస్తున్నామని తెలిపారు. అపోలో ఆస్పత్రి చైర్మన్ పీసీ రెడ్డి దగ్గరుండి అన్నీ రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నారని వివరించారు. ఉపాసనకు సుఖ ప్రసవం జరిగిందని తెలిపారు. అంతకుముందు చిరంజీవి ట్వీట్ చేశారు. చెర్రీ-ఉపాసన దంపతులకు అమ్మాయి జన్మించడంతో తమ ఇంట కాంతులు వెదజిమ్మిందని తెలిపారు. మమ్మల్ని మరింత సంతోషానికి గురిచేసిందన్నారు.
Heartiest Congratulations to my sweetest golden hearted brother @AlwaysRamCharan & my dearest kind hearted lady @upasanakonidela for the precious new arrival . Super happy for proud grand parents @KChiruTweets & Surekha garu . #megaprincess