ఓ చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు లక్షల ఖరీదు చేసే ఇంజెక్షన్ పైన నిర్మల సీతారామన్ రూ.7 లక్షల జీఎస్టీని ఎత్తివేసి, ప్రాణాలు కాపాడారని, ఇందుకు ఆమెకు థ్యాంక్స్ అంటూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ట్వీట్ చేశారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు (Union Minister Nirmala Sitharaman) కాంగ్రెస్ పార్టీ నేత (Congress Party leader), తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ (MP from Thiruvananthapuram, Shashi Tharoor) ధన్యవాదాలు చెప్పారు. చిన్నారి పాప ప్రాణాలు కాపాడటం (saved a girl child’s life) కోసం రూ.7 లక్షల జీఎస్టీని (GST) వదులుకొని, రాజకీయాలు వేరు.. మానవత్వం వేరు (Politics different from humanity) అని నిరూపించారని ప్రశంసించారు. ఈ మేరకు శశిథరూర్ (Shashi Tharoor twitter) తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా గుడ్ న్యూస్టోరీ (GoodNewsStory) అంటూ ట్వీట్ చేశారు. ఏం జరిగిందో ఈ ట్వీట్ లో వివరించారు.
కొద్ది రోజుల క్రితం తన వద్దకు దంపతులు వచ్చారని, తన కూతురు నిహారిక (Niharika) అరుదైన క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు చెప్పారని, ఆమె చికిత్సకు ఉపయోగించే ఇంజెక్షన్ ఖరీదు 65 లక్షల రూపాయలు ఉందని, ఆ మొత్తాన్ని వారు క్రౌడ్ ఫండింగ్, దాతల సహాయంతో సమకూర్చుకున్నారని తెలిపారు. అయితే దిగుమతి చేసుకున్న ఈ ఇంజెక్షన్ పైన అదనంగా రూ.7 లక్షల జీఎస్టీ పడుతోందని, అంత మొత్తాన్ని వారు భరించలేని పరిస్థితుల్లో తన వద్దకు వచ్చి సహాయం కోరారని తెలిపారు. ఇందుకు సంబంధించి తాను నిర్మలమ్మకు లేఖ రాశానని, కానీ అటు నుండి ఎలాంటి స్పందన రాలేదన్నారు. దీంతో తాను ఆమెకు ఫోన్ చేసి, ఈ ఇంజెక్షన్ ను కస్టమ్స్ కస్టడీ నుండి త్వరగా వచ్చేలా చూడాలని కోరినట్లు చెప్పారు. ఆలస్యమైతే అది పాడవుతుందని చెప్పానని వెల్లడించారు.
ఈ క్రమంలో తాను మరోసారి లేఖ రాశానని, తనకు అరగంటలో నిర్మలమ్మ సెక్రటరీ నుండి ఫోన్ వచ్చిందని చెప్పారు. మంత్రి కస్టమ్స్ అధికారులతో మాట్లాడి మార్చి 28న జీఎస్టీ మినహాయింపు ఇచ్చారని, తద్వారా ప్రజలకు ప్రభుత్వం, రాజకీయాలు, మానవత్వంపై ఉన్న నమ్మకాన్ని నిలిపి ఉంచారన్నారు. రాజకీయాలు, మానవత్వం వేరు అని నిరూపించారని అభిప్రాయపడ్డారు. ఇందుకు ఆమెకు థ్యాంక్స్ చెప్పారు. చిన్నారి నిహారిక మోములో నవ్వు కోసం కేంద్ర ఆర్థిక శాఖ రూ.7 లక్షల జీఎస్టీని రద్దు చేసిందని తెలిపారు. తాను రాజకీయాల్లో ఉండాలా వద్దా అనే ప్రశ్న ఉదయించినప్పుడల్లా ఇలాంటి మంచి సంఘటనలు జరుగుతున్నాయని, తద్వారా తాను ముందుకు సాగాల్సిన అవశ్యకతను వెల్లడిస్తున్నాయన్నారు.