Sajjala Ramakrishna Reddy: నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్
ఏపీలో ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై నలుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్(YSRCP) ఎమ్మెల్యేలను(mlas) శుక్రవారం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) నలుగురు ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామ నారాయణరెడ్డిలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు రాబోతున్న తరణంలో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రతి పక్ష పార్టీకి మద్దతు చేసినట్లు తెలుస్తోంది. అయితే నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసినట్లుగా గుర్తించామని ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) స్పష్టం చేశారు. ఈ క్రమంలో వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
వారిలో ఉండవల్లి శ్రీదేవి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామ నారాయణ రెడ్డి ఉన్నారని తెలిపారు. అయితే దర్యాప్తు చేసిన తర్వాతనే ఈ నలుగురిపై చర్యలు తీసుకున్నట్లు సజ్జల పేర్కొన్నారు. మరోవైపు టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు(chandrababu naidu) వీరిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఆ క్రమంలో ఒక్కో ఎమ్మెల్యేకు రూ.15 నుంచి రూ.20 కోట్లు ఇచ్చేందుకు బేరం కుదుర్చుకున్నారని ఎద్దేవా చేశారు. క్రాస్ ఓటింగ్ చేస్తే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తామని చంద్రబాబు వీరికి చెప్పి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.