శివరాత్రి, జగ్ నే కీ రాత్ కి ఆయా వర్గాలు జాగరణ చేస్తారు. భగవన్నామస్మరణలో మునిగి ఉంటారు. ఈ సందర్భంలో కొందరు ఊరేగింపులు చేసే అవకాశం ఉంది. అయితే అత్యంత వేగంగా ఫ్లై ఓవర్లపై నుంచి కొనసాగితే ప్రమాదాలు చోటుచేసుకునే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యగా ఫ్లై ఓవర్లను మూసి వేస్తున్నారు. కాగా ఆదివారం తెల్లవారుజాము తర్వాత తిరిగి ఫ్లై ఓవర్లు తెరచుకుంటాయి.
హైదరాబాద్ (Hyderabad) వాసులకు ముఖ్య గమనిక. రాత్రిళ్లు ఫ్లై ఓవర్ల (Fly Overs)పై నుంచి రాకపోకలు సాగించవద్దు. ఎందుకంటే పోలీసులు (Telangana Police) పై వంతెనలను మూసివేస్తున్నారు. కంగారు పడకండి. ఇది ఒక్క రోజు మాత్రమే. హిందూవుల మహా పర్వదినం మహా శివరాత్రి (Maha Shivaratri)తో పాటు ముస్లింల షబ్- ఈ -మేరజ్ (జగ్నే కి రాత్) (Jagne Ki Raat) సందర్భంగా ఫ్లై ఓవర్లను ముందస్తుగా మూసి వేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. రెండు వర్గాలు రాత్రంతా జాగరణలు చేస్తుండడంతో రాత్రిళ్లు యాత్రలు చేసే అవకాశం ఉండడంతో ఫ్లై ఓవర్లను బంద్ చేస్తున్నారు.
శనివారం రాత్రి 10 గంటల తర్వాత (18/19 తేదీ) హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డు (Necklace Road- PV Marg)తో సహా అన్ని ఫ్లై ఓవర్లను మూసి వేస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. అయితే గ్రీన్‌ల్యాండ్స్ (Greenlands), పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే (PVNR Express Way), లంగర్‌హౌస్ ఫ్లై ఓవర్లకు మాత్రం మినహాయింపు ఉంటుందని వివరించారు. ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. అత్యవసరమైతే ట్రాఫిక్ పోలీస్ (Hyderabad Traffic Police) హెల్ప్‌లైన్ (9010203626) నంబర్ లో సంప్రదించాలని తెలిపారు.
శివరాత్రి, జగ్ నే కీ రాత్ కి ఆయా వర్గాలు జాగరణ చేస్తారు. భగవన్నామస్మరణలో మునిగి ఉంటారు. ఈ సందర్భంలో కొందరు ఊరేగింపులు చేసే అవకాశం ఉంది. అయితే అత్యంత వేగంగా ఫ్లై ఓవర్లపై నుంచి కొనసాగితే ప్రమాదాలు చోటుచేసుకునే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యగా ఫ్లై ఓవర్లను మూసి వేస్తున్నారు. కాగా ఆదివారం తెల్లవారుజాము తర్వాత తిరిగి ఫ్లై ఓవర్లు తెరచుకుంటాయి. పోలీసుల ప్రకటన నేపథ్యంలో నారాయణగూడ, బేగంపేట, రసూల్ పుర, సికింద్రాబాద్, తార్నాక, తెలుగుతల్లీ ఫ్లై ఓవర్, ఎల్బీనగర్, నాగోల్, హైటెక్ సిటీ తదితర ఫ్లై ఓవర్లు రాత్రి పూట బంద్ మూసి ఉండనున్నాయి.