»Fans Who Formed Huge Lines For The Tickets Of The Third Odi Chennai Police Presence
Huge Lines: మూడో వన్డే టిక్కెట్ల కోసం భారీ లైన్లు కట్టిన ఫ్యాన్స్..పోలీసుల బందోబస్తు
భారతదేశం vs ఆస్ట్రేలియా 3వ ODI మ్యాచ్ మార్చి 22న చెన్నై(chennai)లోని చెపాక్ స్టేడియంలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ మ్యాచ్ ఆన్ లైన్ టిక్కెట్లు(tickets) విక్రయించగా..ప్రస్తుతం ఆఫ్ లైన్ టిక్కట్ల కోసం క్రీడాభిమానులు(cricket fans) పెద్ద ఎత్తున క్యూలైన్లు కట్టారు.
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా(india vs australia) జట్ల మధ్య వన్డే వార్ రసవత్తరంగా కొనసాగుతుంది. ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచిన జట్లు మూడో ఆట కోసం సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో మూడో ODI మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా మధ్య మార్చి 22న చెన్నై(chennai)లోని చెపాక్ స్టేడియంలో జరగనుంది. ఇది తెలిన అభిమానులు ఆ మ్యాచ్ చూసేందుకు ఏర్పాటు చేసిన టిక్కెట్ల కోసం ఎగబడుతున్నారు. శనివారం ఉదయం 11 గంటల నుంచే టిక్కెట్లు అందుబాటులోకి వచ్చినా కూడా..టిక్కెట్లు పలు కారణాలతో ఇవ్వకపోవడంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ క్రమంలో పెద్ద ఎత్తున లైన్లలో వేచిఉన్న అభిమానులు రాత్రి అయినా కూడా అక్కడే వేచి ఉన్నారు. ఇంకొంత మంది అయితే దుప్పట్లు తెచ్చుకుని అక్కడే పడుకున్నట్లు తెలిసింది. ఇండియా క్రికెట్ మ్యాచ్ అంటే అభిమానులకు ఎంత క్రేజ్ ఉంటుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న చివరి వన్డే ఇది కావడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. మార్చి 22న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ గేమ్ జరగనుంది. మార్చి 18వ తేదీ ఉదయం 11 గంటల నుంచి టిక్కెట్ల(tickets) విక్రయం ప్రారంభం కాగా, తెల్లవారుజామున 1 గంటల నుంచే అభిమానులు పెద్ద ఎత్తున క్యూలో ఉన్నారు. ఈ క్రమంలో స్థానిక పోలీసులు అభిమానులను అదుపు చేయడం వారి కష్టతరంగా మారింది. స్టేడియం వెలుపల బారీ కేడ్లు ఏర్పాటు చేసిన వచ్చిన అభిమానులను నియంత్రించే ప్రయత్నం చేశారు.
Cricket fans standing in long queue to purchase tickets for India v/s Australia, 3rd ODI, going to be held at MA Chidambaram Stadium, Chepauk, #Chennai. pic.twitter.com/VOI8fxLPPI
అయితే ఒక వ్యక్తికి 2 టిక్కెట్లు మాత్రమే ఇస్తామని తమిళ క్రికెట్ అసోసియేషన్ చెప్పడంతోనే ఇలా ఎక్కువ మంది క్రీడాభిమానులు(cricket fans) వచ్చారని పలువురు అంటున్నారు. దీంతో పాటు బ్లాక్ టిక్కెట్లు కొనుగోలు చేసే వారికి కూడా కఠిన హెచ్చరికలు జారీ చేశారు. మార్చి 18న ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు టిక్కెట్లను విక్రయిస్తున్నారు. అంతకుముందు మార్చి 13 నుంచి ఆన్లైన్ టిక్కెట్లు విక్రయించబడ్డాయి. కానీ ప్రస్తుతం ఆఫ్లైన్ టిక్కెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.