»Etela Rajender And Komatireddy Rajagopal Reddy Spoke After The Meeting In Delhi
Delhi:లో భేటీ అనంతరం మాట్లాడిన ఈటల, రాజగోపాల్ రెడ్డి
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్(Etela rajender), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(komatireddy Rajagopal Reddy) భేటీ ముగిసింది. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి ఢిల్లీ నేతలకు చెప్పినట్లు వారు వెల్లడించారు.
తెలంగాణ బీజేపీలో నెలకొన్న అసంతృప్తిని చక్కదిద్దేందుకు బీజేపీ(BJP) హైకమాండ్ రంగంలోకి దిగింది. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను ఢిల్లీకి పిలిపించారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వారిద్దరితో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. వారి అసంతృప్తికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. భారతీయ రాష్ట్ర సమితిని ఓడించడమే లక్ష్యంగా బీజేపీలో చేరామని.. ఈ నేతలు చెప్పగా ఇప్పుడు బీఆర్ఎస్(BRS)తో పొత్తు పెట్టుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉందన్న అంశాన్ని హైకమాండ్ ముందు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్(Etela rajender), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(komatireddy Rajagopal Reddy) భేటీ ముగిసింది. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. భేటీ అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు ముక్కుసూటిగా వివరించాం అని, కేసీఆర్ దోపిడీ పాలనకు బీజేపీతోనే అడ్డుపడుతుందని ప్రజలు నమ్మారు. కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యమైంది. త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పినట్లు ఈటెల, కోమటిరెడ్డి వివరించారు. తెలంగాణలో బీజేపీని ప్రజలు విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు.
రెండు పార్టీల మధ్య దోస్తీ ఉందని ప్రజలు నమ్ముతున్నారని గతంలో కొందరు నేతలు వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం, పాలిట పరిస్థితులు మారాయి. బెంగాల్ తరహా రాజకీయాలతో బీజేపీ(BJP) హైప్ పెంచాల్సిన అవసరం ఉందని అధ్యక్షుడు నడ్డాకు నేతలు వివరించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్తో రాజీపడే ప్రశ్నే లేదని చెబుతున్నారు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని వెల్లడించినట్లు సమాచారం. వీరితోపాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(kishan reddy) కూడా వారితో భేటీలో పాల్గొనేందుకు హడావుడిగా ఢిల్లీ చేరుకున్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ విజయానికి బీజేపీ సిద్ధం చేసిన ప్రణాళికలను ఆయన సమక్షంలోనే ఈటల, రాజగోపాల్ రెడ్డిలకు వివరించినట్లు తెలుస్తోంది.