వరుస భూకంపాలు(Earthquakes) ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా టర్కీ(Turkey)లో మరోసారి భూకంపం సంభవించింది. మలాట్యా ప్రావిన్స్ లోని ఎసిల్యర్ట్ నగరంలో సోమవారం భారీ భూకంపం(Earthquakes) సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రతతో ఈ భూకంపం నమోదైంది. ఈ భూకంపం వల్ల అనేక భవనాలు కుప్పకూలాయి. భారీ ఆస్తి నష్టం వాటిల్లింది.

భూకంపం(Earthquakes) వల్ల శిథిలమైన భవనాల కింద ఎవరైనా చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఒక బిల్డింగ్ శిథిలాల కింద తండ్రీకూతుర్లు చిక్కుకుని ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారిని శిథిలాల నుంచి రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక భవనాలు నేలమట్టమవ్వడంతో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
ఎసిల్యర్ట్ నగరంలో అనేక బిల్డింగులు నేలమట్టమయ్యాయి. ఈ విషయాన్ని ఆ నగర మేయర్ మెహ్మెట్ సినార్ మీడియాకు వెల్లడించారు. ఫిబ్రవరి 6వ తేది కూడా 7.8 తీవ్రతతో టర్కీలో భారీ భూకంపం(Earthquakes) సంభవించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో బిల్డింగ్స్ కూలిన ఘటనలో చాలా మంది ప్రాణాలు విడిచారు. టర్కీ భూకంపం(Earthquakes) వల్ల ఇప్పటి వరకూ 48,000 మందికి పైగా ప్రాణాలు వదిలారు. మొత్తం 1,73,000 బిల్డింగులు నేలమట్టమయ్యాయి.