TG: హైదరాబాద్లోని శంకరపల్లిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ ఈదురు గాలుల ధాటికి NCC కన్స్ట్రక్షన్కు చెందిన ఒక భారీ క్రేన్ కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.