»Director Neelakanta With Hit Tv Exclusive Interview Circle Movie
Director Neelakanta: సర్కిల్ మూవీతో మరో నంది అవార్డు ఖాయం?
ఐదు నంది అవార్డులను గెలుచుకున్న ప్రముఖ తెలుగు దర్శకుడు నీలకంఠ(Neelakanta) ప్రస్తుతం సర్కిల్ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ క్రమంలో ఈ చిత్ర దర్శకుడితో హిట్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం.
పలు నంది అవార్డులతోపాటు జాతీయ అవార్డులు కూడా గెల్చుకున్న ప్రముఖ తెలుగు దర్శకుడు నీలకంఠ(Neelakanta). ఇతను తాజాగా డైరెక్షన్ చేసిన మూవీ సర్కిల్(circle). ఈ చిత్రం జూలై 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హిట్ టీవీ ప్రత్యేక ఇంటర్వూలో ఆయన కీలక విషయాలను పంచుకున్నారు. నీలకంఠ ఆంధ్రప్రదేశ్లోని కడపలో జన్మించగా.. విజయవాడలోని లయోలా పబ్లిక్ స్కూల్, లయోలా కాలేజీలో చదివారు. అతని పాఠశాల రోజుల నుంచి చలనచిత్రంపై మక్కువతో అతని గ్రాడ్యుయేషన్ తర్వాత చెన్నైకి వెళ్లి సినీరంగంలో చేరారు.
ఈ సర్కిల్ చిత్రంలో బాబా బాస్కర్(baba bhaskar) క్యారెక్టర్ ను నెగెటివ్ క్యారెక్టర్లో చూపించినట్లు నీలకంఠ పేర్కొన్నారు. అంతేకాదు ఈ చిత్రంతో బాబా బాస్కర్ కు మంచి రోల్ పడిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతోపాటు ఫన్ కూడా యాడ్ చేశామని, సర్కిల్ మూవీలో ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పారు. హీరో సాయి రోనాక్ తోపాటు పలువురు ఆర్టిస్టులు కూడా వారి క్యారెక్టర్ల పరిధి మేరకు చాలా బాగా నటించారని వెల్లడించారు. అయితే ఇంకా ఏం చెప్పారో తెలియాలంటే మాత్రం ఈ పూర్తి వీడియోను చూడాలి.