»Dil Raju Family Ashish Reddy Hero Ready For Marriage
Dil raju: ఇంట పెళ్లి సందడి..యంగ్ హీరో పెళ్లికి రెడీ!
ప్రస్తుతం టాలీవుడ్ సెలబ్రిటీస్ చాలామంది ఇంట్లో పెళ్లి సందడి వాతవరణం కనిపిస్తోంది. నవంబర్ 1న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి జరగనుండగా.. ఇప్పుడు దిల్ రాజు ఇంట పెళ్లి సందడి స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది.
రౌడీ బాయ్స్ సినిమాతో దిల్ రాజు(dilraju) వారసుడిగా అతని తమ్ముడి కొడుకు ఆశిష్ రెడ్డి(Ashish Reddy) హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ యంగ్ హీరో హీరో సుకుమార్ శిష్యుడు కాశి విశాల్ దర్శకత్వంలో ‘సెల్ఫీష్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి సుకుమార్ డైలాగ్స్ అందిస్తుండగా.. దిల్ రాజు ప్రొడక్షన్స్‌తో కలిసి సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో లవ్ టుడే ఫేమ్ ఇవానా హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన సెల్ఫిష్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే.. పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతున్నాడు ఆశిష్. ఇటీవలె దిల్ రాజు తండ్రి మృతి చెందిన విషయం తెలసిందే. విషాదం జరిగిన ఇంట్లోనే శుభకార్యం జరిపితే మంచి జరుగుతుందని.. ఆశిష్ పెళ్లి చేయాలనీ భావిస్తున్నారట కుటుంబ సభ్యులు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక బిజినెస్ మ్యాన్ కుటుంబంలోని అమ్మాయితో ఆశిష్ పెళ్లి ఫిక్స్ చేశారట. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమని తెలుస్తోంది. త్వరలోనే దిల్ రాజు కుటుంబం.. ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించనుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ ఏడాదిలో ఎంగేజ్మెంట్ జరిపి.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న పెళ్లికి(marriage) ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా సమాచారం. ఈ పెళ్లిని జైపూర్‌లో అంగరంగ వైభవంగా చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా.. ఈ ఏడాది చాలామంది సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. రీసెంట్గా వెంకటేష్ కూతురు హయవాహిని ఎంగేజ్ మెంట్ జరిగిన సంగతి తెలిసిందే.