ఓ వైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సాగుతున్న సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సర్జికల్ దాడులపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అసలు సర్జికల్ దాడులే జరగలేదని, ఆ దాడులకు ఆధారాలు కూడా లేవన్నారు.
నియంత్రణ రేఖను దాటి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత బలగాలు జరిపిన సర్జికల్ దాడుల్లో ఉగ్రవాదులను చంపేశామని అబద్ధాలు చెబుతూ పబ్బం గడుపుకుంటున్నారన్నారని ఆరోపించారు. 2016, 2019లో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై జరిగిన సర్జికల్ దాడులకు సంబందించి మోడీ ప్రభుత్వం పార్లమెంట్‌కు ఆధారాలు సమర్పించలేదన్నారు.
భారత్ జోడో యాత్రలో భాగంగా జమ్మూలో జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. ప్రజలంతా ముందుకొచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.