»Dgp Kv Rajendranath Reddy Said Provocative Statements On Social Media Will Be Dealt With
DGP KV Rajendranath Reddy: సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే తాటతీస్తాం
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గించే విధంగా ప్రజాప్రతినిధులు సహా ఎవరైనా పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి(DGP KV Rajendranath Reddy) స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో కొత్త డీఎస్పీ ఆఫీసు(dsp office)ను ప్రారంభించిన నేపథ్యంలో పేర్కొన్నారు.
DGP KV Rajendranath Reddy said provocative statements on social media will be dealt with
ఏపీలో రాజకీయ పార్టీలు పోలీసులకు సహకరించాలని, శాంతిభద్రతల సమస్య తలెత్తేలా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదని ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి(DGP KV Rajendranath Reddy) పేర్కొన్నారు. అంతేకాదు సోషల్ మీడియా(social media)కు కూడా రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయడం గాని, వాటని ఇతరులకు షేర్ చేయడం కానీ చేయోద్దని కోరారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఏవరైనా ప్రయత్నాలు చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. మరోవైపు పుంగనూరు ఘటనలో పోలీసులపై దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 1.4 కోట్ల మంది మహిళలు దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారని, యాప్ ద్వారా సమస్యల్లో ఉన్న 27,000 మంది మహిళలను పోలీసులు రక్షించారని ఆయన చెప్పారు.
దీంతోపాటు రాష్ట్రంలో సైబర్ నేరాలను(cyber crime) అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు. సీనియర్ అధికారి ఆధ్వర్యంలో సైబర్ సెల్, సోషల్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. బ్యాంకు ఖాతాల హ్యాకింగ్‌కు సంబంధించిన కేసులను ఛేదించేందుకు 1930 యాప్‌ను త్వరలో ప్రవేశపెడతామని చెప్పారు. గతేడాదితో పోలిస్తే నేరాల రేటు 20 శాతం తగ్గిందని చెప్పారు. రాష్ట్రంలో గంజాయి వ్యాప్తిని అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక కృషి చేశారని, ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగును ధ్వంసం చేశారని డీజీపీ అన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో నూతనంగా నిర్మించిన డీఎస్పీ కార్యాలయాన్ని(dsp office) డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ప్రజలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో భవనాన్ని నిర్మించామన్నారు. నేరారోపణ ఆధారిత పోలీసింగ్ వ్యవస్థపై రాష్ట్ర పోలీసులు ఎక్కువ దృష్టి సారిస్తున్నారని, అందులో భాగంగా 104 కేసుల్లో ముగ్గురికి మరణశిక్ష, 37 మందికి జీవిత ఖైదు, 62 కేసుల్లో 7 నుంచి 20 ఏళ్ల జైలుశిక్ష పడ్డాయని డీజీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రసాద్ రాజు, ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్, ఎస్పీ రవిప్రకాష్, డీఎస్పీలు మనోహరాచారి, ఆంజనేయరెడ్డి, దాతలు విశ్వనాథరాజు, అజిత్‌కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు.
#Inauguration of DSP office in Narsapuram-#APPolice:Today #DGP Shri K.V Rajendranath Reddy IPS,inaugurated DSP Office in Narsapuram,West Godavari(D), constructed at a cost of Rs 1.2 cr.(1/9) pic.twitter.com/c7dC2yDsUZ