IPL CSK : అసెంబ్లీలో చెన్నై సూపర్ కింగ్స్‌ను బ్యాన్ చేయాలని డిమాండ్
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ (Cricket) అభిమానులకు ఐపిఎల్ (IPL) వినోదాన్ని అందిస్తోంది. అయితే ఈ ఐపీఎల్ తమిళనాడు అసెంబ్లీ(Assembly)లో మాత్రం రగడకు దారితీసింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై నిషేధం విధించాలని పీఎంకే శాసన సభ్యుడు ఎస్పీ వెంకటేశ్వరన్ డిమాండ్ చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ (Cricket) అభిమానులకు ఐపిఎల్ (IPL) వినోదాన్ని అందిస్తోంది. అయితే ఈ ఐపీఎల్ తమిళనాడు అసెంబ్లీ(Assembly)లో మాత్రం రగడకు దారితీసింది. తమిళనాడు (Tamilnadu) టీమ్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings) జట్టులో ఒక్క తమిళ ఆటగాడు కూడా లేడని పీఎంకే(PMK) పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై నిషేధం విధించాలని పీఎంకే శాసన సభ్యుడు ఎస్పీ వెంకటేశ్వరన్ డిమాండ్ చేశారు.
తమిళనాడు (Tamilnadu) రాష్ట్రంలో చాలా మంది ప్రతిభావంతులు ఉన్నారని, అద్భుతమైన క్రికెటర్లు ఉన్నప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings) జట్టులో మాత్రం ఒక్క తమిళ క్రికెటర్ కూడా లేకపోవడం దారుణమన్నారు. తమిళనాడు టీమ్ అని ప్రచారం చేసుకుంటున్న ఆ జట్టు యాజమాన్యం తమ ప్రజల నుంచి వాణిజ్యపరమైన లాభాలు పొందుతోందని, కానీ తమ రాష్ట్ర క్రికెటర్ల(Cricketers)కు అన్యాయం చేస్తోందని ఎస్పీ వెంకటేశ్వరన్ మండిపడ్డారు.
అసెంబ్లీ(Assembly)లో క్రీడాభివృద్ధి నిధుల కేటాయింపు అంశానికి సంబంధించి ప్రస్తావన వచ్చింది. దీనికి అన్నాడీఎంకే మాత్రం ఇంకోలా రియాక్ట్ అయ్యింది. ఎమ్మెల్యేలకు ఐపీఎల్(IPL) టికెట్లు సమకూర్చాలని అన్నాడీఎంకే ఎమ్మెల్యే వేలుమణి రాష్ట్ర సర్కార్ ను డిమాండ్ చేశారు. ఐపీఎల్(IPL) మ్యాచ్ లు ఉచితంగా చూసేందుకు పాసులు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.