ఢీల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను సీబీఐ (CBI) అధికారులు విచారించనున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Kejriwal) ఆసక్తికర ట్వీట్ చేశారు. దేవుడు నీతో ఉన్నాడు మనీశ్. లక్షలాది మంది పిల్లలు, వారి తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు ఉన్నాయి. దేశంకోసం, సమాజం కోసం జైలుకు వెళ్లినప్పుడు జైలుకు వెళ్లడం దుర్మార్గం కాదు, ఘనత. మీరు త్వరగా జైలు నుంచి తిరిగి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
ఢీల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను సీబీఐ (CBI) అధికారులు విచారించనున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Kejriwal) ఆసక్తికర ట్వీట్ చేశారు. దేవుడు నీతో ఉన్నాడు మనీశ్. లక్షలాది మంది పిల్లలు, వారి తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు ఉన్నాయి. దేశంకోసం, సమాజం కోసం జైలుకు వెళ్లినప్పుడు జైలుకు వెళ్లడం దుర్మార్గం కాదు, ఘనత. మీరు త్వరగా జైలు నుంచి తిరిగి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. తాజా ట్వీట్‌తో సిసోడియా (Sisodia) అరెస్టు ఖాయమన్న వాదన ఢిల్లీ రాజకీయాల్లో వినిపిస్తోంది. సిసోడియా సీబీఐ (CBI) కార్యాలయంకు వెళ్లనున్న నేపథ్యంలో ఆయన ఇంటిబయట కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అతని ఇంటి వద్ద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మోహరించారు. సిసోడియా ఇంటి ప్రవేశానికి ఇరువైపులా నాలుగు లేయర్ల బారికేడ్లనుసైతం ఏర్పాటు చేశారు. ఆయన ఆదివారం ఉదయం సీబీఐ కార్యాలయం వద్దకు వెళ్లేందుకు బయలుదేరారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో ఆప్ కార్యాకర్తలు ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు.
సీబీఐ కార్యాలయంకు వెళ్లే క్రమంలో మనీశ్ రాజ్‌ఘాట్‌లో( Rajghat) జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అక్కడి నుంచి నేరుగా సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు సిసోడియాను విచారించనున్నారు. దక్షిణ ఢిల్లీ పోలీసులు (police) భద్రతను పెంచారు. సీబీఐ కేంద్ర కార్యాలయానికి వెళ్లే అన్ని మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అంతేకాక, కార్యాలయం వద్ద 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. ఈమేరకు కార్యాలయం వెలుపల బ్యానర్లుసైతం ఏర్పాటు చేశారు. సిసోడియాను విచారించే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు సీబీఐ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తారన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్థానిక పోలీసులు, పారా మిలటరీ బలగాలను భారీగా సంఖ్యలో మోహరించారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే సిసోడియాను విచారణ (investigation) అనంతరం సీబీఐ అధికారులు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.