HYD: శంషాబాద్ రోడ్డుపై రెండు లారీలు ఢీకొనడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పాలమాకుల వైపు నుంచి శంషాబాద్ వైపు వెళ్లే ప్రధాన మార్గంలో ఈరోజు ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ప్రయాణికులు కొద్ది సేపు ఇబ్బంది పడ్డారు.