KDP: తొండూరు మండలం మల్లేల గ్రామంలోని ఇమాంబి దర్గాలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు హుండీలు పగలగొట్టినట్లు ఎస్సై ఘన మద్దిలేటి తెలిపారు. దీపావళి అమావాస్యను పురస్కరించుకొని ముస్లిం సోదరులు ఇమాంబి దర్గాను దర్శించుకుని వెళ్లిపోయారు. గుర్తు తెలియని వ్యక్తులు దర్గాలో ఉన్న హుండీని పగలగొట్టి అందులో ఉన్న దాదాపు రూ.30 వేల నగదును దొంగిలించారని పేర్కొన్నారు.