AKP: చోడవరం సబ్ జైల్ నుంచి శుక్రవారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో ఇద్దరు రిమాండ్ ఖైదీలు సిబ్బందిపై దాడి చేసి పరారయ్యారు. బెజవాడ రాము, నక్క రవికుమార్ అనే ముద్దాయిలు సబ్ జైల్లోని జైల్ వార్డెన్ తలపై సుత్తితో దాడి చేసి జైలు నుంచి పారిపోయిన ఘటన కలకలం సృష్టించింది. రాము చోరీ కేసులో నిందితుడు నక్కా రవి కుమార్ పెన్షన్ సొమ్ము మాయం చేసిన కేసులో నిందితుడు.