Committee Has Formed Will Decide Party Next Chief:Ajit Pawar
Ajit Pawar:దేశ రాజకీయాల్లో ఓ కుదుపు.. సీనియర్ నేత, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) పార్టీ అధ్యక్ష పదవీకి రాజీనామా చేశారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు.. ముఖ్యంగా అజిత్ పవార్ (Ajit Pawar) ఓ వర్గం ఏర్పాటు చేసి.. బీజేపీతో దోస్తి చేయడం శరద్ పవార్‌కు (Sharad Pawar) నచ్చలేదు. అందుకే ఈ రోజు పార్టీ అధ్యక్ష పదవీకి రాజీనామా చేశారు. తర్వాత అజిత్ పవార్ మీడియాతో మాట్లాడారు.
శరద్ పవార్ (Sharad Pawar) తర్వాత పార్టీ అధ్యక్ష పదవీ ఎవరు చేపట్టాలనే అంశంపై కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. కమిటీ సమావేశమై.. తదుపరి అధ్యక్షుడిని ఎంపిక చేస్తుందని తెలిపారు. కమిటీ అంటే ఎన్సీపీ ఫ్యామిలీ అని అందులో కీలక నేతలు, శరద్ పవార్ (Sharad Pawar) కూతురు సుప్రియ సూలే, తాను ఉంటామని పేర్కొన్నారు. కమిటీ నిర్ణయాన్ని అమలు చేస్తామని శరద్ పవార్ (Sharad Pawar) ఇప్పటికే ప్రకటించారని గుర్తుచేశారు.
శరద్ పవార్ (Sharad Pawar) రాజీనామాతో ఆయన అనుచరులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రాజీనామా వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. శరద్ పవార్ (Sharad Pawar) కీలక నేత.. కాంగ్రెస్ పార్టీలో కీ రోల్ పోషించారు. తర్వాత సోనియాతో పొసగక బయటకు వచ్చారు. లేదంటే ఆయన ప్రధాని స్థాయి నేత. కాంగ్రెస్‌ను వీడి.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర, ఇతర చోట్ల పార్టీ ప్రభ ఉంది.
కాంగ్రెస్, శివసేనతో ఇదివరకు మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఏక్నాథ్ షిండే తిరుగుబాటు చేయడంతో ఆ ప్రభుత్వం కూలిపోయింది. తర్వాత షిండే-బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అజిత్ పవార్ (Ajit Pawar) కూడా 40-50 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపారని.. ప్రభుత్వంలో చేరబోతున్నారనే వార్తలు వినిపించాయి. దీంతో శరద్ పవార్ విసుగుచెంది రాజీనామా చేసి ఉంటారనే వాదనలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర ఎన్నికలు పూర్తయిన వెంటనే ఫడ్నవీస్ సీఎంగా, అజిత్ పవార్ (Ajit Pawar) డిప్యూటీ సీఎంగా ప్రభుత్వం ఏర్పాటు చేశారు. శరద్ పవార్ రంగంలోకి దిగడంతో.. అజిత్ మెత్తబడ్డారు. చివరికీ ఫడ్నవీస్ సీఎం పదవీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోవడంతో శరద్ పవార్ రాజీనామా దిగారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.