రష్మిక, విజయ్ దేవరకొండ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి అందరికీ తెలిసిందే. అంతే కాదు వీరిమధ్య బయట కూడా మంచి రిలేషన్ ఉంది. అందుకే రష్మిక విజయ్‌ని పార్టీ కావాలి అని అడిగింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
Heroine Rashmika Mandanna who asked Vijay Deverakonda to party
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇద్దరు బెస్ట్ ఆన్‌స్క్రీన్ పెయిర్ అని నిరుపించుకున్నారు. అంతే కాదు వీరి మధ్య బయట కూడా మంచి రిలేషన్షిప్ ఉంది. అందుకే రష్మిక చేసిన తాజా పోస్ట్ వైరల్ అవుతుంది. విజయ్‌ని పార్టీ అడిగిన విషయంపై ఇంటర్నెట్లో చర్చ నడుస్తుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాగూర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఫ్యామిలీ స్టార్. పరుసురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై విజయ్ ఫ్యాన్స్‌కు భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ సైతం అంచనాలను పెంచేసింది. దీనిపై రష్మిక స్పందించింది. మై డీయర్ లవ్లీఫ్రెండ్స్ విజయ్ దేవరకొండ, పరుసురాం ఫ్యామిలీ స్టార్ చిత్రంతో హిట్ కొడుతారని ఆశిస్తున్న. ఏప్రిల్ 5 కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న.. నాకు పార్టీ కావాలి అని రాసుకొచ్చింది.
దీనిపై విజయ్ దేవరకొండ సైతం రిప్లై ఇచ్చాడు. క్యూటెస్ట్ అని రిప్లై ఇవ్వడంతో నెటిజను తమదైన శైలీలో కామెంట్లు చేస్తున్నారు. తాజాగా తిరుపతిలో ఫ్యామిలీ స్టార్ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఈ సినిమా అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నారు. ఫ్యామిలీ, సెంటిమెంట్, లవ్, యాక్షన్ ఇలా అన్ని భావోద్వేగాలు ఉన్నాయని పేర్కొన్నారు. గీతాగోవిందం సినిమా తరువాత లైగర్ చిత్రం ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఆ తరువాత శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఖుషి చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు అందరి దృష్టి ఫ్యామిలి స్టార్ చిత్రంపై ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.