Road Accident: కమెడియన్ గీతా సింగ్ కుమారుడు దుర్మరణం
‘కితకితలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను నవ్వించిన గీతా సింగ్ కు అసలు వివాహం కాలేదు. కానీ ఆమె తన అన్న కుమారులను పెంచి పోషిస్తోంది. ఆమె అన్నయ్య అనారోగ్యంతో కన్నుమూయడంతో ఆయన ఇద్దరు కుమారుల బాధ్యతను గీతా సింగ్ తీసుకున్నారు. అప్పటి నుంచి ఆ ఇద్దరితో పాటు తన చుట్టాలమ్మాయిని కూడా పెంచుతోంది. అందరి ఆలనాపాలనా ఆమె చూసుకుంటున్నారు.
తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న హాస్య నటి (Comedian) గీతా సింగ్ (Geetha Singh) ఇంట్లో విషాదం నెలకొంది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో ఆమె దిగ్భ్రాంతికి లోనయ్యారు. కుమారుడి మృతితో ఆమె తట్టుకోలేకపోతున్నారు. ఈ విషయాన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కల్యాణి వెల్లడించారు. సోషల్ మీడియాలో ఆమె ఈ ప్రమాదం విషయాన్ని పంచుకుంది. ఈ సందర్భంగా నెటిజన్లుకు రోడ్డు భద్రత నియమాలను గుర్తు చేసింది.
‘కితకితలు’ సినిమా (Kithakithalu Movie)తో తెలుగు ప్రేక్షకులను నవ్వించిన గీతా సింగ్ కు అసలు వివాహం (Marriage) కాలేదు. కానీ ఆమె తన అన్న కుమారులను పెంచి పోషిస్తోంది. ఆమె అన్నయ్య (Elder Brother) అనారోగ్యంతో కన్నుమూయడంతో ఆయన ఇద్దరు కుమారుల బాధ్యతను గీతా సింగ్ తీసుకున్నారు. అప్పటి నుంచి ఆ ఇద్దరితో పాటు తన చుట్టాలమ్మాయిని కూడా పెంచుతోంది. అందరి ఆలనాపాలనా ఆమె చూసుకుంటున్నారు. సొంత పిల్లలుగా గీత చూసుకుంటోంది. అయితే పెద్దబ్బాయి తన నలుగురు స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో వారి కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన గీతా సింగ్ కుమారుడు దుర్మరణం పాలయ్యాడు. ఇప్పటివరకు మాత్రం ఈ వివరాలు తెలిశాయి. కుమారుడి పేరు ఏమిటి? ప్రమాదం ఎక్కడ జరిగింది? అనే తదితర వివరాలు తెలియలేదు.
అయితే ఈ ప్రమాదం విషయాన్ని మాత్రం కరాటే కల్యాణి (Karate Kalyani) పంచుకున్నారు. కల్యాణి తన ఫేసు బుక్ లో ఈ ప్రమాద వార్త గురించి పోస్టు చేశారు. ‘దయచేసి కారులో అయినా.. బైక్ అయినా జాగ్రత్తగా వెళ్లండి పిల్లలు. కమెడియన్ గీతా సింగ్ అబ్బాయి యాక్సిడెంట్ వల్ల మృతి చెందాడు. ఓం శాంతి’ అని ఫేసు బుక్ (Facebook)లో పంచుకుంది. దీంతో ఈ ప్రమాద వార్త తెలిసింది. ఈ సంఘటనపై ఇప్పటివరకు గీతా సింగ్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ ప్రమాదం కర్ణాటకలో జరిగిందని తెలుస్తున్నది.
తెలుగులో గీతా సింగ్ చాలా సినిమాలు చేసింది. ఈవీవీ సత్యనారాయణ గీతా సింగ్ కు అపార అవకాశాలు కల్పించాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో గీతా సింగ్ కీలక పాత్రలో మెరిసింది. హాస్య నేపథ్యంలో సాగే సినిమాల్లో గీత కనిపించింది. ఎవడిగోల వాడిది సినిమాతో ఆమెకు మంచి పేరు వచ్చింది. అనంతరం అల్లరి నరేశ్ నటించిన ‘కితకితలు’ సినిమా ఆమె కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించి ప్రేక్షుకులను నవ్వించారు. ప్రస్తుతం గీతకు సినీ అవకాశాలు రావడం లేదు. తెరపై నవ్వులు పంచుతున్న ఆమెకు వ్యక్తిగత జీవితంలో మాత్రం పుట్టెడు కష్టాలు ఉన్నారు. ఆమెను డబ్బుల కోసం కొందరు మోసం చేశారు. దీంతో భారీగా నష్టపోయింది. ఉన్న ఆదాయంతోనే తాను చేరదీసిన పిల్లలను పోషిస్తూ గీతా సింగ్ జీవితాన్ని నెట్టు కొస్తోంది.