»Collapse In The Mine Two Dead 50 More Missing At China Mongolia
Mine Collapse: గనిలో ప్రమాదం..ఇద్దరు మృతి, మరో 50 మంది మిస్సింగ్
చైనాలోని మంగోలియా ప్రాంతంలో ఓ ఒపెన్ కాస్ట్ మైన్ కూప్పకూలడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో 50 మంది గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న అధికారులు గనిలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపడుతున్నారు.
ఉత్తర చైనా(china)లోని మంగోలియా(mongolia) ప్రాంతంలో ఈరోజు ఓ బొగ్గు గని కూలిపోవడం(mine collapse)తో ఇద్దరు మరణించారు. మరో 50 మందికి పైగా తప్పిపోయినట్లు అక్కడి మీడియా పేర్కొంది. జిన్‌జింగ్ కోల్ మైనింగ్ కంపెనీ నిర్వహించే ఓపెన్ కాస్ట్ మైన్ లో ఈ ప్రమాదం సంభవించినట్లు వెలుగులోకి వచ్చింది. ఆ ప్రాంతం పశ్చిమ భాగంలోని అల్క్సా లీగ్‌లో ఉండగా.. సాయంత్ర 5 గంటలకు గనిలో కార్మికులు తవ్వకాలు జరుపుతున్న క్రమంలో కుప్పకూలినట్లు తెలిసింది. ఆ క్రమంలో లోపల చిక్కుకున్న వారి కోసం అధికారులు చర్యలు చేపడుతున్నారు.
మరోవైపు అక్కడ పనిచేసే అనేక మంది సిబ్బంది వాహనాలు శిథిలాల కింద చిక్కుకున్నాయి. సమాచారం తెలుసుకున్న అధికారులు రెస్క్యూ సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపారు. తప్పిపోయిన వ్యక్తులను శోధించి, రక్షించడం సాధ్యమైనంత త్వరగా చేయాలని చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్(jinping) అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఆ క్రమంలో గాయపడిన వారిని రక్షించి, చికిత్స చేయడానికి తగిన ప్రయత్నం చేయాలని కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 330 కంటే ఎక్కువ మంది సిబ్బందితో కూడిన ఎనిమిది రెస్క్యూ టీమ్(rescue team)లు 100కి పైగా రెస్క్యూ పరికరాలతో పాటుగా సైట్‌కు పంపినట్లు తెలిసింది.
మరోవైపు చైనా(china)లో ప్రతి ఏటా గనుల్లో విరివిగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే గత డిసెంబరులో వాయువ్య జింజియాంగ్ ప్రాంతంలో ఓ బంగారు గని(gold mine) కూలిపోయినప్పుడు దాదాపు 40 మంది వ్యక్తులు అక్కడ పని చేస్తున్నట్లు తెలిసింది. అంతకుముందు 2021లో ఉత్తర షాంగ్జీ ప్రావిన్స్‌లో బొగ్గు గనిలో ఆకస్మాత్తుగా వరదలు రావడంతో ఇద్దరు మృతి చెందగా, మరో 20 మంది మైనర్లను కాపాడారు.