»Brs Leader And Folk Singer Saichand Died Of Heart Attack
BRS leader:ఫోక్ సింగర్ సాయిచంద్ గుండెపోటుతో మృతి
బీఆర్ఎస్ పార్టీలో యువనేతగా ఉన్న ఫోక్ సింగర్ సాయిచంద్(39) గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ సభ్యులతో కలసి నాగర్ కర్నూల్ జిల్లాలోని తన పొలానికి వెళ్లిన సాయిచంద్ బుధవారం రాత్రి అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.
తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయిచంద్(39)(Saichand)బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. బుధవారం సాయంత్రం సాయిచంద్ తన కుటుంబ సభ్యులతో కలిసి కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం కారుకొండలోని తన ఫాంహౌస్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకున్నాడు. అర్ధరాత్రి గుండెపోటు(heart attack) రావడంతో కుటుంబ సభ్యులు నాగర్‌కర్నూల్‌లోని గాయత్రి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించారు. అయితే మెరుగైన వైద్యం అందించాలని భార్య రజని కోరడంతో సాయిచంద్‌ను వెంటనే హైదరాబాద్ కేర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బీఆర్ఎస్ నాయకుడు(BRS leader) మృతి చెందాడు. సాయిచంద్ గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సాయిచంద్ మృతి పట్ల బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తెలంగాణ(telangana) రాష్ట్ర ఉద్యమ కాలం నుంచి పార్టీ నాయకుల మధ్య తన పాటలు, పోరాట పటిమతో ప్రజల్లో చైతన్యం నింపిన సాయిచంద్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఆయన మృతి పట్ల కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. సాయి చందు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ పలువురు సోషల్ మీడియా(social media)లో పోస్ట్ చేస్తున్నారు. తెలంగాణ ఓ మంచి గాయకుడిని కోల్పోయిందని ఆవేదన చెందుతున్నారు.