మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో ఏ1, ఏ2 నిందితులుగా రామోజీరావు, శైలజా కిరణ్ లను గుర్తిస్తూ సీఐడీ నోటీసులిచ్చింది. జులై 5వ తేదిన వారు గుంటూరులో విచారణకు రావాలని కోరింది.
మార్గదర్శి చిట్ ఫండ్స్(Margadarshi Chits Funds) కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రామోజీరావు(Ramoji Rao), శైలజా కిరణ్(Silaja Kiran)లకు సీఐడీ(CID) నోటీసులిచ్చింది. ఈ కేసు విషయంలో గత కొన్ని రోజులుగా సీఐడీ దర్యాప్తు(CID Investigation) చేస్తోన్న సంగతి తెలిసిందే. మార్గదర్శి చిట్ ఫండ్స్‌లో భారీగా అవకతవకలు జరిగినట్లు సీఐడీ గుర్తించి ఆ దిశగా దర్యాప్తు చేస్తోంది.
తాజాగా ఈ కేసు(Margadarshi Chits Funds Case)లో 41ఏ కింద రామోజీరావు(Ramoji Rao)కు నోటీసులు ఇచ్చింది. జులై 5వ తేదిన గుంటూరులోని సీఐడీ రిజనల్ కార్యాలయంలో రామోజీరావు, శైలజా కిరణ్(Silaja Kiran)లు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో ప్రధానంగా ఏ1(A1) నిందితుడిగా రామోజీరావును, ఏ2(A2)గా శైలజా కిరణ్ ల పేర్లు సీఐడీ(CID) నమోదు చేసింది. ఈ కేసు విషయంలో ఇప్పటికే ఈనెల మొదటి వారంలోనే ఏ2గా శైలజా కిరణ్‌ను ఆమె నివాసంలోనే సీఐడీ విచారించింది.