»Pawan Kalyan Shocking Comments On Tollywood Star Heroes
Pawan kalyan: స్టార్ హీరోలపై పవన్ షాకింగ్ కామెంట్స్!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పర్యటనలో భాగంగా టాలీవుడ్ హీరోల గురించి ప్రస్తావించారు. వారాహిలో గోదావరి జిల్లాలను కవర్ చేస్తూ రైతులనుద్దేశించి ప్రసంగిస్తున్న క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. అయితే ఈ మధ్య ఆ షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చి, తన పొలిటికల్ కెరీర్ పై దృష్టి పెట్టారు. ముఖ్యంగా అధికార పార్టీ చేస్తున్న తప్పులు ఎత్తి చూపుతూ ఆయన తన వారాహి వాహనంలో గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే, రైతులతో మాట్లాడుతూ టాలీవుడ్ స్టార్ హీరోల ప్రస్తావన ఆయన తీసుకురావడం విశేషం. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ..వీళ్లందరంటే నాకు గౌరవం, ఇష్టం. వాళ్ల సినిమాలు నేను చూస్తా. కనిపిస్తే మాట్లాడుకుంటాం. అయితే సినిమాల పరంగా మీకు హీరోల మీదున్న ఇష్టాన్ని రాజకీయంగా చూపించకండి.
ఎందుకంటే రాజకీయాలు వేరు. ఇక్కడ రైతుకు కులం లేదు. సినిమాలు ఇష్టపడితే మహేష్, జూనియర్ ఎన్టీఆర్.. ఇలా ఎవరినైనా ఇష్టపడండి. రాజకీయం దగ్గరికి వచ్చేసరికి నా మాట వినండి ఒక్కసారి. మహేష్, ప్రభాష్ నా కంటే పెద్ద హీరోలు. పాన్ ఇండియా హీరోలు కాబట్టి నా కంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయికి వెళ్లిపోయారు. వాళ్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుసు. కానీ నేను తెలియదు. అయినా నాకు ఎలాంటి ఇగో లేదు. సగటు మనిషి బాగుండాలి నాకు. కష్టంలో ఉన్న ఒక దళిత కుటుంబంలోని పేదరికాన్ని పారదోలాలి. నేను ఇట్లానే ఆలోచిస్తానని పవన్ అన్నారు. సినిమాలను, రాజకీయాలను కలపవద్దని ఆయన కోరడం విశేషం. తనకు ఎలాంటి అహంకారం లేదని, మీ జీవితంలో, రైతుల జీవితాల్లో వెలుగులు చూడటమే తన ధ్యేయమని ఆయన అన్నారు. మీరు ఏ హీరో అభిమాని అయినా, మెరుగైన జీవనోపాధి కోసం పోరాడటానికి తనతో చేతులు కలపమని ఆయన కోరడం విశేషం. కాగా ఇప్పుడు పవన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.