»Brs Leader Who Kidnapped The Girl And Raped Her At Bodhan
Minor girl:ను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన BRS నేత
తెలంగాణలో బీఆర్ఎస్(BRS) నేతలపై వస్తున్న లైంగిక వేధింపులు క్రమంగా పెరుగుతున్నాయి. మొన్న జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ రాజయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కూడా ఓ యువతిని లైంగికంగా వేధించాడని వెలుగులోకి వచ్చింది. తాజాగా బోధన్‌లో ఏకంగా బీఆర్ఎస్ నేత ఓ 13 ఏళ్ల బాలికపై అత్యచారం చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఓ 13 ఏళ్ల బాలిక(minor girl)పై ఓ యువకుడు కన్నేశాడు. అంతటితో ఆగలేదు. ఆమె ఓ రోజు రోడ్డుపై వెళుతున్న క్రమంలో ఓ ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. అయితే ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు కూడా. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్(bodhan) మండలంలో జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు బీఆర్ఎస్ పార్టీ(BRS party) నేత రవిగా గుర్తించారు. ఇతను భోధన్ మున్సిపాలిటీలోని బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ రాధాకృష్ణ సోదరుడు. అయితే బాధిత బాలిక తల్లి ఇచ్చిన సమాచారంతో మైనార్టీ నాయకులు ఈ ఘటన గురించి పోలీసులకు తెలిపారు. నిందితునితోపాటు ఈ ఘటన గురించి ఎవరికీ చెప్పొద్దని బెదిరించారని స్థానికులు చెబుతున్నారు.
ఈ క్రమంలో నిందితునితోపాటు పోలీసులు రాధాకృష్ణను కూడా అదుపులోకి తీసుకున్నారు. రవిపై అత్యాచారం, పోక్సో చట్టాల కింద పోలీసులు(police) కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ ఘటన గురించి తెలిసిన స్థానిక ఎమ్మెల్యే షకీల్ ఆ బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిందితుడు బాలిక కాళ్లు, చేతులు కట్టేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రవితోపాటు అతని సోదరుడు రాధాకృష్ణను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.
అయితే ఈ ఘటన ఈనెల 19న సాయంత్రం జరుగగా..బుధవారం బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లి(mother)కి విషయం చెప్పింది. ఆమె కాస్తా పలువురికి విషయం చెప్పడంతో ఆ వర్గానికి చెందిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని శిక్షించాలని పోలీస్ స్టేషన్ కు వచ్చి డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఇలాంటి లైంగిక దాడులకు పాల్పడుతున్న నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.