»36 Special Trains Between Visakhapatnam Tirupati And Secunderabad
Visakhapatnam-Secunderabad: విశాఖ, తిరుపతి, సికింద్రాబాద్ మధ్య 36 స్పెషల్ ట్రైన్స్
తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే ఇప్పటికే నడుస్తున్న ట్రైన్లతోపాటు పలు 36 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అవెంటి ఎక్కడెక్కడ ప్రయాణిస్తాయో ఇప్పుడు చుద్దాం.
విశాఖ-సికింద్రాబాద్(Visakhapatnam-Secunderabad) మధ్య ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. వాటిలో విశాఖపట్నం-సికింద్రాబాద్, విశాఖపట్నం-మహబూబ్‌నగర్, విశాఖపట్నం-తిరుపతి, భువనేశ్వర్-తిరుపతి మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు ఉన్నాయి. ఈ రైళ్ల సమయాలు, ఈ ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్ల వివరాలు ఇప్పుడు చుద్దాం. రైల్వే 08579 రైలు నంబర్‌ను విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వీక్లీ స్పెషల్ రైలును జూలై 5 నుంచి జూలై 26, 2023 వరకు పొడిగించారు. ఈ రైలు విశాఖపట్నం నుంచి ప్రతి బుధవారం రాత్రి 7 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.05 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు నాలుగు ట్రిప్పులు అందుబాటులో ఉంటుంది.
సికింద్రాబాద్-విశాఖపట్నం ప్రత్యేక రైలు
రైల్వే 08580 రైలు నంబర్‌ను సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు జూలై 6 నుంచి జూలై 27, 2023 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సికింద్రాబాద్‌లో ప్రతి గురువారం రాత్రి 7.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు కూడా నాలుగు ట్రిప్పులు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లె, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతాయి.
విశాఖపట్నం-మహబూబ్‌నగర్ మధ్య మరో స్పెషల్ ట్రైన్
రైల్వే రైలు నంబర్ 08585 విశాఖపట్నం నుంచి మహబూబ్‌నగర్ వరకు వీక్లీ స్పెషల్ రైలు(special trains). ఇది జూలై 4 నుంచి జూలై 25, 2023 వరకు కొనసాగనుంది. ఈ రైలు విశాఖపట్నం నుంచి ప్రతి మంగళవారం సాయంత్రం 5.35 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు మహబూబ్‌నగర్ చేరుకుంటుంది. ఈ రైలు నాలుగు ట్రిప్పులు నడవనుంది.